Live News Now
  • పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. అక్కడే గుండెపోటుతో మృతి
  • రాత్రి పదకొండున్నర సమయంలో గుండెపోటు రావడంతో శ్రీదేవి మృతి
  • శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన చలనచిత్ర పరిశ్రమ
  • 1963 ఆగస్టు13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. నాలుగేళ్లవయసులో బాలనటిగా సినిమాల్లోకి అడుగు
  • తిరిగిరాని లోకానికి తరలివెళ్లిన అందం 'శ్రీదేవి'... షారూఖ్ తో చివరి సినిమా
  • 240 సినిమాల్లో నటించిన శ్రీదేవిని వరించిన 15 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..
  • సౌతాఫ్రికా టూర్‌లో చరిత్ర సృష్టించిన కొహ్లీసేన.. టీ20 సిరీస్ భారత్ కైవసం
  • తొలిసారి సఫారీ గడ్డపై వన్డే,టీ ట్వంటీ సిరీస్‌లు కైవసం.. దిగ్గజాలకు సాధ్యంకాని ఘనతను అందుకున్న కోహ్లీ
  • శ్రీదేవి అందానికి, అభినయానికి స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఫిదా ఆమెతో సినిమా తీయాలని తహతహ..
  • 1980 అంటే శ్రీదేవి సంవత్సరమే..2103లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
ScrollLogo తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష ScrollLogo మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం ScrollLogo భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం ScrollLogo పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్ ScrollLogo సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. ScrollLogo ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు ScrollLogo రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు.. ScrollLogo రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్ ScrollLogo జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
Tollywood/Bollywood

రాజుగారి గది-2 రివ్యూ

Raju-Gari-Gadhi-2-Movie-Review
Posted: 135 Days Ago
Views: 733   

రివ్యూ: రాజుగారి గది-2
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
మ్యూజిక్: థమన్
నిర్మాత: ప్రసాద్.వి. పొట్లూరి
దర్శకుడు: ఓంకార్
రిలీజ్ తేది: 13-10-2017
నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్, అశ్విన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, శకలక శంకర్, రావు రమేశ్, నరేష్, విద్యుల్లేఖ, తదితరులు

కోడలు వచ్చింది హిట్ తీసుకువచ్చింది అని అందరూ అనాలి. రాజుగారి గది-2 సినిమా అలాగే ఉంటుంది అని నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మనం తర్వాత నాగ్, సమంత కలిసి నటించిన ఈసినిమా అదే బజ్ తో ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మరి నాగార్జున ఫస్ట్ టైం చేసిన ఈ హర్రర్ కామెడీ అక్కినేని ఫ్యామిలీకి ఎంత స్పెషల్ గా మారింది? రెండో రాజుగారిగదిలోకి వెళ్లిన ప్రేక్షకుల ఎక్స్ పీరియన్స్ ఏంటి? చూద్దాం
కథ:
అశ్విన్(అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్(ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురూ కలిసి ఇంట్లోవాళ్లతో గొడవపడీ మరి డబ్బులు తెచ్చి ఓ రిసార్ట్ కొంటారు. ఆ రిసార్ట్ కు వచ్చిన సుహానిసా(సీరత్ కపూర్) ను పడెయ్యడానికి కిశోర్, ప్రవీణ్ చాలా ట్రై చేస్తుంటారు. ఆ ట్రైల్స్ లోనే సుహానిసా దెయ్యం అని తెలుస్తుంది. ఆ దెయ్యాన్ని బయటకు పంపడానికి మెంటలిస్ట్ రుద్ర(నాగార్జున)ను తీసుకొస్తారు. అయితే రుద్ర, సుహానిసా దెయ్యం కాదు, అమృత(సమంత) దెయ్యం అని కనుక్కుంటాడు. రిసార్ట్ లో ఉన్న వాళ్లందరినీ ఏం చెయ్యకుండా కేవలం అశ్విన్, కిశోర్, ప్రవీణ్ లనే ఎందుకు వెంటాడుతుందనే మిస్టరీని ఛేదించే క్రమంలో రుద్ర కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుంటాడు. రిసార్ట్ ఓనర్స్ ను పక్కనపెట్టి దెయ్యానికి హెల్ప్ చేస్తుంటాడు రుద్ర. మరి రుద్ర దెయ్యం వళ్ల ఇబ్బంది పడుతోన్నవాళ్లను పక్కనపెట్టి, దెయ్యానికి ఎందుకు సహాయం చేస్తున్నాడు? అసలు రుద్రకు అమృతకు సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.    
విశ్లేషణ:
రాజు గారి గది టైటిల్ కు సీక్వెల్ గా వచ్చిన రాజు గారి గది-2 అదే ఫార్మాట్ లో హర్రర్ కామెడీగా తెరకెక్కింది. మళయాలం ప్రేతమ్ కథ రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా ఇప్పటివరకు వచ్చిన హర్రర్ కామెడీ మూవీస్ తో పోల్చితే ఈ రాజుగారిగది-2 కొంచెం భిన్నమనే చెప్పాలి. రొటీన్ దెయ్యాలకథల్లో కనిపించని హ్యూమనిజాన్ని, మనుషులకు మానవత్వాన్ని గుర్తు చెయ్యాల్సిన అవసరాన్ని టచ్ చేసి, మెసేజ్ ఓరియెంటెడ్ దెయ్యం కథగా రాజుగారి గది-2ను తెరకెక్కించాడు ఓంకార్. హర్రర్, కామెడీని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తే ఈ పాయింట్ ను మించిన కమర్షియల్ సినిమా మరొకటి ఉండదు. ఓంకార్ కూడా రాజుగారిగది-2ని సేమ్ మిక్చర్ గా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు. ఫస్టాఫ్ మొత్తం అశ్విన్, వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ కామెడీతో నడిపించాడు. అశ్విన్ ను హీరోమెటీరియల్ గా చూపించాల్సిన అన్నయ్య, అశ్విన్ కారెక్టర్ ను అలాగే ఎక్స్ పోజ్ చేస్తే, కిశోర్, ప్రవీణ్  లతో కామెడీ జనరేట్ చేయించాడు. బీచ్ లకు రిసార్ట్స్ కు వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అనుకునే కుర్రాళ్లే, రిసార్ట్స్ కు ఓనర్స్ అయితే, అక్కడికొచ్చే అమ్మాయిలను ఫ్లర్ట్ చెయ్యడానికి కిశోర్, ప్రవీణ్ లు పడే ప్రయాసలు కామెడీగా ఉంటాయి. ఆ ట్రైల్స్ లోనే ఇద్దరితో డేటింగ్ అంటూ సీరత్ కపూర్ చేసే బ్యూటీఫుల్ హంగామా యూత్ ఆడియన్స్ పల్స్ రేట్ పెంచుతుంది. సముద్ర స్నానాలు, కనిపించిన ప్రతీ ఫ్రేమ్ లో షార్ట్స్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి హాటీ హీరోయిన్ అనే ఇమేజ్ కు సింబల్ గా మారింది సీరత్. ఈ ఫ్లర్ట్స్ ఇలా కొనసాగుతోన్న సినిమాలోకి ఓ దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచాడు దర్శకుడు. రిసార్ట్ లో ఉన్న దెయ్యాన్ని బయటకుపంపించడానికి నాగార్జున ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. మెంటలిస్ట్ గా, న్యూ అవతార్ లో నాగార్జున ఎంటర్ కావడంతో ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీ మొదలవుతుంది. ఆ అంచనాలను అందుకుంటూ నాగ్ పాత్ర డేరింగ్ సాగుతుంది. ప్రపంచంలోనే టాప్-5 మెంటలిస్టుల్లో ఒకడిగా రుద్ర పాత్రలో నాగార్జున చంద్రముఖి రజనీకాంత్ ను గుర్తుకుతెస్తాడు. సమంత దెయ్యంగా మారిన ఫ్లాష్ బ్యాక్ ను ఇన్వెస్టిగేట్ చేసే ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అమృతగా ఎల్.ఎల్.బిలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన సమంత ఆత్మహత్య ఎందుకు చేసింది, ఆ సుసైడ్ కు కారణం ఎవరు? అనే కేసును డీల్ చేసే ఎపిసోడ్ ను ఓంకార్ ఎంగేజింగ్ గానే డైరెక్ట్ చేశాడు. అమృత పాత్రలో సమంత నటన కొత్తగా ఉంది. తండ్రి చాటు బిడ్డగా, చదువు తప్ప మరొకటి తెలియని ఇన్నోసెంట్ స్టూడెంట్ గా బాగానే నటించింది. పోటీ ప్రపంచంలో ముందున్నవాడిని దాటుకుని వెళ్లాలంటే కష్టపడాలి గానీ, కుట్రలు కుతంత్రాలు చెయ్యకూడదు, అవి మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తాయి. అమ్మాయిలు బోల్డన్ని రిస్ట్రిక్షన్స్ ను దాటుకుని ప్రపంచంలోకి వస్తున్నారు. అలాంటిది ఆడవాళ్లే ఆడవాళ్లకు శతృవులుగా మారితే...వాళ్లు తమ గోల్స్ ను ఎలా రీచ్ కాగలరు? అనే పాయింట్ ను ఇన్నర్ గా చాలా బాగా చెప్పాడు ఓంకార్. ఈ ఎపిసోడ్ లో అమృతకు సాయం చేసే రుద్రగా నాగార్జున, అమృత మరణానికి కారణం అయిన కిరణ్ గా అభినయ పాత్రలు ఆడియన్స్ ను  ఆలోచింపజేస్తాయి. కథ స్ట్రాంగ్ గా ఉన్నా, కథనంలో కొన్ని లోపాలుండడంతో సినిమా ఒక్కోసారి పట్టుతప్పిందేమో అనిపిస్తుంది. కానీ నాగార్జున, సమంతల ప్రజెన్స్, థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ సినిమాను రిచ్ గా చూపిస్తాయి. గ్రాఫిక్స్ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దీంతో రాజుగారి గది-2 ఎంగేజింగ్ గా ఉంటుంది.

చివరిగా:
గదిలో హర్రర్ కామెడీ కొంచెం తక్కువే


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials