Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఆకాశం నుంచి చూస్తే శ్రీ మహాలక్ష్మి ఆలయం శ్రీచక్రం ఆకారంలో..

Largest-Golden-Temple-in-the-World
Posted: 247 Days Ago
Views: 6551   

తమిళనాడు లోని వేలూరు నుంచి దక్షిణాన వూసూర్‌ ఆనైకట్లు వెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీపురం నెలకొంది. ప్రతిరోజూ ఉదయం 5.00 గంటల నుంచి 7.30 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, అలంకారం, హారతి ఉంటాయి. ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలకు అనుమతించరు. ఉదయం 7.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరచి ఉంచుతారు. 
నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తిఅమ్మ. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్‌. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్‌ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్‌. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు. 1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం... ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.
శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణీ దేవాలయం వ్యయపరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఈ వ్యయంతో పోలిస్తే బంగారం కొనేందుకు పెట్టిన ఖర్చు తక్కువ.
* నిర్మాణానికి అవసరమైన బంగారం కొనుగోలులో పారదర్శకతను పాటించారు. రిజర్వ్‌బ్యాంకు అనుమతి పొంది మినరల్స్‌ అండ్‌ మెటల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ బంగారాన్ని కొనుగోలు చేశారు.
* కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది.
* 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
* ఆలయానికి రాజగోపురం ఉంది. తిరుమల ఆలయానికి మల్లే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్‌ పూర్తిగా బంగారంతో చేసిందే.
* ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్‌లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు.
* ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
* ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహంతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు.
* ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది.
* ఆలయంలో ఎలాంటి నామస్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి, వెలుపలికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి.

చిత్తూరు నుంచి 49 కి.మీ.దూరంలో తిరుపతి నుంచి 134 కి.మీ.దూరంలో ఉన్న శ్రీ పురానికి చేరుకోవాలంటే కాట్పాడి రైల్వేస్టేషన్‌లో దిగి చేరుకోవచ్చు. చెన్నై విమానాశ్రయం నుంచి 145 కి.మీ. దూరంలో ఈ క్షేత్రముంది. తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని సందర్శించుకోవచ్చు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials