Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రోడ్డునపడ్డ ఏపీ కాపు కార్పొరేషన్ పరువు..!

Kapu-Corporation-MD-vs-Chairman
Posted: 246 Days Ago
Views: 379   

ఏపీ కాపు కార్పొరేషన్ ప‌రువు రోడ్డున ప‌డింది. ఇన్నాళ్లూ నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న కార్పొరేష‌న్ చైర్మన్‌, ఎండీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయంటూ ఎండీని ప్రభుత్వం బాధ్యతల నుంచి త‌ప్పించింది. అయితే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని చెప్పేందుకు ప్రయత్నించిన ఎండీని చైర్మన్‌ అడ్డుకోవడంతో వివాదం రేగింది. దీంతో దిక్కులేక రోడ్డుపైనే వివ‌ర‌ణ ఇచ్చారు అమరేందర్‌.

ఎంతో మంచి ల‌క్ష్యంతో కాపుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన కాపు కార్పొరేష‌న్ మొదట్నుంచి వివాదాల‌ మయంగా మారింది. ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తూ కాపుల అభివృద్ధి కోసం సీఎం తపన పడుతుంటే.. ఆ లక్ష్యాన్ని చైర్మన్‌ రామానుజయ, ఎండీ అమరేందర్‌ నీరుగార్చారు. కార్పొరేషన్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎండీ, చైర్మన్ల మధ్య సఖ్యత చాలా అవసరం. కానీ, కాపు కార్పొరేషన్‌ మాత్రం దానికి భిన్నంగా మారింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో వెనకబడిపోయింది. ప్రభుత్వం కేటాయించే నిధులను అడ్డదారిన తమ ఖాతాలో వేసుకునేందుకు చైర్మన్‌ రామానుజయ, ఎండీ అమరేందర్‌ పోటీపడ్డారు. ఫలితంగా రుణాల మంజూరు, వివిధ పథకాల అమలు దారి తప్పింది. చివరకు కార్పొరేషన్‌పై వస్తున్న ఆరోపణలతో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి విచారణ కమిటీని నియమించారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఎండీ అమరేందర్‌ను బదిలీ చేస్తూ ఉదయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అవినీతి ఆరోపణల కారణంగానే బాధ్యతల నుంచి తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.

ఇక్కడే సీన్‌ మలుపు తిరిగింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదంటూ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎండీ అమరేందర్‌. ఇదే స‌మ‌యంలో కాపు కార్పొరేష‌న్ కార్యాల‌యానికి వ‌చ్చిన చైర్మన్‌ రామానుజ‌య ఎండీతో వాగ్వాదానికి దిగారు. కార్పొరేష‌న్ తనదని, తన కార్యాల‌యంలో ఎలా ప్రెస్ మీట్ పెడ‌తావంటూ నిల‌దీశారు. అయితే తానింకా రిలీవ్ కాలేదని, తనకు సీఎంవో అనుమతి ఉందని అమరేందర్‌ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఇక్కడ ఏం టాంపరింగ్‌ చేస్తున్నావంటూ అమరేందర్‌పై ఊగిపోయారు రామానుజయ. సీఎంవో చెబితే నాకేంటంటూ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నారు. ఒకవేళ ప్రెస్‌మీట్‌ పెడితే తాను కూడా ఉంటానని ఆంక్ష పెట్టారు. దీనికి అంగీకరించని ఎండీ రోడ్డుమీదకొచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టారు. దీంతో ఇన్నాళ్లూ లోపల జరుగుతున్న వ్యవహారం రోడ్డున పడ్డట్టయింది.

అయితే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని అమ‌రేంద్ర స్పష్టం చేశారు. త‌న‌ను మాతృశాఖ‌కు బ‌దిలీ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను ఎండీగా రాక‌ముందు జ‌రిగిన త‌ప్పుల‌ను కూడా త‌న‌పై రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత‌మంది కార్పొరేష‌న్ ప్రతిష్టను దిగ‌జార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కాపు విద్యార్ధుల‌కు ఉచిత కోచింగ్ కోసం కోచింగ్ సెంట‌ర్ల ఎంపిక‌లోనూ ఎలాంటి అక్రమాలు జ‌ర‌గ‌లేద‌న్నారు. అటు కుట్టుమిష‌న్ల కొనుగోళ్లు కార్పొరేష‌న్ నుంచి జ‌ర‌గలేద‌ని అదంతా మ‌హిళా సాధికార సంస్థ చూసుకుంటుంద‌ని అన్నారు. విచార‌ణ జ‌రుగుతుండ‌గానే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు ఎండీ అమరేందర్‌. మొత్తంగా కాపు సంక్షేమం కోసం సీఎం ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్ ప‌రువు తాజా ఘ‌ట‌న‌తో బజారున ప‌డింది. మ‌రో రెండు నెల‌ల్లో చైర్మన్‌ రామానుజ‌య ప‌ద‌వీకాలం ముగుస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఎండీ, చైర్మన్‌లుగా సరైన వ్యక్తులను నియమించాలని అంతా కోరుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials