Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

వంద ఎకరాల విస్తీర్ణం..1500 కిలోల బంగారంతో శ్రీమహాలక్ష్మి స్వర్ణ దేవాలయం..

Golden-Temple-Vellore-History
Posted: 38 Days Ago
Views: 1183   

స్వర్ణ దేవాలయం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది.. అమృత్ సర్ లోని గురుద్వారా..!! కానీ స్వర్ణ దేవాలయం ను మించిన స్వర్ణ దేవాలయం.. మన దక్షిణ భారత దేశంలో ఉంది.. అవును ఆ దేవలయం లో.. స్తంభాలు బంగారం... వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం, విమానం, అర్ధమంటపం శఠగోపం... అన్నీ బంగారంతో చేసినవే. అంటే దేవాలయం మొత్తం స్వర్ణ మయం అన్నమాట. ఇది అమృత్‌సర్‌ గురుద్వారా కాదు, తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం!
వంద ఎకరాల విస్తీర్ణం... 1500 కిలోల బంగారం... 400 మంది శిల్పులు... ఆరేళ్ల నిరంతర శ్రమ... అద్భుతమైన శిల్ప చాతుర్యం... సుమారు 600 కోట్ల రూపాయలు... వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణదేవాలయం.
ఇప్పటివరకూ స్వర్ణదేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్‌సర్‌. కానీ, ఇప్పుడా ఖ్యాతిని శ్రీపురమూ దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలూ శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు. ఆ తరవాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి, శిల్పాలను తీర్చిదిద్దారు. అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్‌తోనే రూపొందించి, బంగారు తొడుగుతో అలంకరించారు.
చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలైకోడిగా ప్రసిద్ధి. మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు. ఆలయాన్ని చేరుకోవాలంటే 1.5 కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాలి. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్‌, బైబిలులోని ప్రవచనాలను రాశారు. వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞానసుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తిఅమ్మ ఉద్దేశం.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం, కృత్రిమ ఫౌంటెన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమవైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. మానవుడు తన ఏడు జన్మల్నీ దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు.
వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ప్లాటినంతో రూపొందించిన నగలు, స్వర్ణకవచాలు, కిరీటంతో స్వర్ణతామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది. పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచుని అమ్మవారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి, సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం, ఆలయం చుట్టూ 10 అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది.
అంతా ఒక్కటే! అంతేకాదు ఇక్కడ మిగిలిన ఆలయాల్లోలాగా దర్శనం విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు. అందరూ క్యూలో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. తారతమ్యాలు లేని సమానత్వాన్ని ఇక్కడ పాటిస్తారు. భద్రత దృష్ట్యా ఆలయంలోకి సెల్‌ఫోన్లు, కెమేరాలు, తినుబండారాలను అనుమతించరు.
ఆలయ సందర్శనం ముగించుకుని బయటకు వచ్చే సరికి... అమ్మవారి దివ్యమంగళ స్వరూపం, గోడలపై కనిపించే మతగ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. వారిని సదా ఆధ్మాత్మిక మార్గంలో నడిపిస్తాయి... అని శక్తిఅమ్మ చెబుతుంటారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials