Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

పవన్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెడుతున్న అనిరుధ్ పుట్టిన రోజు నేడు

Happy-birthday-to-Anirudh-Ravichander
Posted: 248 Days Ago
Views: 530   

అనిరుథ్ రవిచందర్...కోలీవుడ్లో ప్రజెంట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. కుర్ర హీరోలందరికీ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్ పాడిన వై దిల్ కోలవెరితో పాపులర్ అయిన అనిరుథ్, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ స్టార్ డమ్ సంపాదించాడు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న అనిరుథ్, మంచి సింగర్ కూడా. ధనుష్ నటించిన 3 మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ గా కోలీవుడ్లో జర్నీ స్టార్ట్ చేశాడు అనిరుథ్. త్వరలోనే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న, ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పుట్టిన రోజు నేడు..
ఆ తర్వాత వనక్కమ్ చెన్నై, వేలయిల్ల పట్టదారి, మాన్ కరాటే, కాకి సెట్టై, మారి, నానుమ్ రౌడీదాన్, తంగమాగన్, వేదాళం, రెమో, వివేగం వంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి, ఆ సినిమాల సక్సెస్ లో కీ రోల్ పోషించాడు.
అనిరుథ్ సంగీతం అందించిన చిత్రాల్లో కొన్ని సినిమాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో, ఆ పాటల ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ఆదరణ కూడా పొందాడు అనిరుథ్. తాను కంపోజ్ చేసిన సినిమాల్లోనే కాక, బయట మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలతోనూ కలిపి 80కి పైగా పాటలు పాడాడు అనిరుథ్.
ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ని టాలీవుడ్ కి తీసుకురావాలని చాలా మంది దర్శకులు ట్రై చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టువదలకుండా ట్రై చేసి, పవన్ కళ్యాణ్ తో చేస్తున్న అజ్ఞాతవాసికి అనిరుథ్ తోనే మ్యూజిక్ చేయించుకుంటున్నాడు. హారికా అండ్ హాసినీ బ్యానర్లో రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అజ్ఞాతవాసి కోసం, అనిరుథ్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడట. ఆల్ రెడీ పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఓ సాంగ్ ప్రోమోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ప్రజెంట్ తమిళ్ లోనే నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ ఇస్తున్న, ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తోనే, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ మ్యూజిక్ చేయించుకోబోతున్నాడని తెలుస్తోంది. కోలీవుడ్లో మాదిరిగానే టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ ని కూడా మెప్పించి, ఇంకా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అనిరుథ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలతో..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials