Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

విభేదాలు, ఆర్ధిక ఇబ్బందులు లేవు... అయినా ఐదుగురు ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు

5-of-family-found-dead-in-Hyderabad-Outer-Ring-Road,-suicide-suspected
Posted: 244 Days Ago
Views: 1534   

ఎవరితో విభేదాల్లేవ్‌.. ఆర్థిక ఇబ్బందులు అంతకన్నా లేవ్‌.. మరి ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారు.. హైదరాబాద్‌ శివార్లలో ఐదుగురి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌లు పోలీసులను కన్ఫ్యూజ్‌ చేస్తున్నాయి. కేక్‌లో విషం కలిపి తిన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌ శివార్లలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఐదుగురి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఎన్నో అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి. ఒకేసారి ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత బలవన్మరణాలుగా అంచనాకు వచ్చారు పోలీసులు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. కారు పక్కనే తిని పడేసిన కేక్ బాక్స్ ఉంది. ఈ కేక్‌లో కూడా విషం కలిపి తిన్నట్లు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. భార్య మాధవి, కుమారుడు వర్షిత్, పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తె సింధూజతో కలసి శ్రీశైలం వెళ్తున్నామని చెప్పి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంసభ్యులు వారి సెల్ ఫోన్‌కు కాల్ చేయగా అందుబాటులోకి రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. సోమవారం ఉదయం ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని పొదల్లో మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఓ మహిళ, మరో ఇద్దరు యువతులు కావడంతో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ మృతదేహాలకు మరో కిలోమీటర్ న్నర దూరంలో కారులో మరో రెండు డెడ్‌బాడీలు కనిపించాయి. అందులో ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు వర్షిత్ మృతదేహాలు ఉన్నాయి.
మృతదేహాల వద్ద.. కేక్, కూల్ డ్రింక్ బాటిల్, ఐదు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. క్లూస్ టీం రంగంలోకి దిగి పరిసరాలను పరిశీలించింది. వస్తువులన్నీ సేకరించి ఫోరెన్సిక్ నివేదికకు పంపారు. పోస్టుమార్టం రిపోర్టుతో పాటు.. ఫోరెన్సిక్ నివేదిక ద్వారా అసలు విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు.
మరోవైపు ప్రభాకర్ రెడ్డికి, అతని పిన్ని లక్ష్మికుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెబుతున్నారు బంధువులు. ఎవరితోనూ గొడవలు కూడా లేవంటున్నారు. అయితే, ప్రభాకర్ రెడ్డి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారని.. అందులో నష్టం రావడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. చిన్నమ్మ లక్ష్మి నుంచి ఐదు కోట్లు అప్పుగా తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డికి నష్టం వచ్చి.. సూసైడ్ చేసుకుంటే.. పిన్ని లక్ష్మి కూడా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే ప్రశ్న మిస్టరీగా మారింది.

ఐదుగురి ఆత్మహత్య కేసులో పోలీసుల ముమ్మర విచారణ


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials