Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఏ మంత్రం వేశావే అంటోన్న అర్జున్ రెడ్డి

Vijay-Deverakonda's-Ye-Mantram-Vesave-First-Look-release
Posted: 242 Days Ago
Views: 287   

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ మిస్టరీగా మారుతున్నాడు. అంటే అతని ఆటిట్యూడ్ ఏంటో తెలుసునుకునేవాళ్లకు ఈ హీరో ఎప్పుడూ అర్ధం కాడని కొంతమంది కామెంట్ చేస్తుంటారు అది వేరే విషయం. బట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఆ విషయం గురించి కాదు లేండి. ఇతను చేస్తోన్న సినిమాలపైనే సినీజనాలకు క్లారిటీ మిస్ అవుతోంది.
అర్జున్ రెడ్డి ప్రీరిలీజ్ ఫంక్షన్ స్పీచ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ కు యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ప్రొఫైల్ పిక్స్, డిపీస్ తో విజయ్ ను తమలో కలిపేసుకున్నారు. విజయ్ కూడా స్ట్రయిట్ ఫార్వర్డ్ బిహేవియర్ తో తెలుగుకుర్రాళ్లల్లో ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ఈ క్రేజే విజయ్ కు క్రేజీ ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. స్టార్ బ్యానర్స్ కూడా విజయ్ కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
పెళ్లిచూపులు సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్, ఈసినిమాతోనే నాలుగైదు ప్రాజెక్టుల్లో భాగం అయిపోయాడు. గీతాఆర్ట్స్-2లో పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. అలాగే యశ్ రంగినేని నిర్మాణంలో భరత్ కమ్మ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. కె.ఎస్.రామారావ్ నిర్మాణంలో క్రాంతి మాధవ్ తో ఓ లవ్ స్టోరీకి కమిట్ అయ్యాడు. వీటితోపాటు నందినీ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాణంలో ఓ సినిమా, వైజయంతి మూవీస్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.
విజయ్ ఇంకా యువి క్రియేషన్స్ లోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. మారుతి-యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే ఈసినిమాకు రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇవి ఇప్పటివరకు పైప్ లైన్ లో ప్రాజెక్టులు. అయితే నిన్న దీపావళి సందర్భంగా విజయ్, శ్రీధర్ మర్రి కాంబినేషన్ లో ఏ మంత్రం వేశావే అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. దీంతో విజయ్ ఇంకా ఎన్ని సినిమాలకు సైన్ చేశాడు? అ హీరో కిడ్డీలో ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా విజయ్ స్పీడ్ చూస్తోంటే ఈ యంగ్ స్టర్ బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకునేలాగే కనిపిస్తున్నాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials