Live News Now
  • రాజ్యసభలో టీడీపీ నిరసనల హోరు.. గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా
  • వాయిదాలపై ఏపీ ఎంపీల ఆగ్రహం.. కేంద్రం తీరుపై ఆందోళన పథం
  • విశాఖ అభివృద్ధిపై విష్ణు సెటైర్లు.. కేంద్రం టార్గెట్‌గా టీడీపీ కౌంటర్లు
  • లోక్‌పాల్‌పై పోరుబాట.. ఢిల్లీలో దీక్షకు దిగిన అన్నా హజారే
  • వర్షాకాలానికి కోయిల్‌ సాగర్‌ పూర్తి.. లక్ష ఎకరాలకు నీరిస్తామన్న హరీష్‌
  • వరకట్నం కేసులో హెడ్ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ దాడి
  • కేంద్రంతో మాటల్లేవ్‌.. చర్చల్లేవ్‌.. హోదాపై చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌
  • రాజ్యసభ విజయంతో టీఆర్ఎస్ లో జోష్‌.. రెబెల్స్‌పై వేటుకు టి-కాంగ్ కంప్లైంట్‌
  • ఎస్‌ఐ దాడితో కానిస్టేబుల్‌ సూసైడ్‌ అటెంప్ట్‌
  • అవిశ్వాసం ఎపిసోడ్‌లోకి కాంగ్రెస్‌.. మంగళవారం పరిణామాలపై ఆసక్తి
ScrollLogo పన్ను రద్దు.. బకాయిలు మాఫీ.. కల్లుగీత కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు ScrollLogo దేశవ్యాప్తంగా 25 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ ScrollLogo బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి.. తెరపైకి తెచ్చిన శరద్ యాదవ్ ScrollLogo ఆరోరోజూ తెలుగు ఎంపీల అవిశ్వాస పోరాటం ScrollLogo 8 బ్యాంకులు.. 1394 కోట్ల బకాయిలు.. టొటెం గ్రూప్‌లో సీబీఐ సోదాలు ScrollLogo రైతు సమస్యలపై టీ-బీజేపీ పోరు బాట... ScrollLogo అవుటర్‌పై కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి ScrollLogo హోదా పోరులో వెనకడుగు లేదు - ఏపీ సీఎం ScrollLogo రాములోరి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు 30న కల్యాణం ScrollLogo ఆగని టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే ఆందోళనలు.. నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ వాయిదా

ఏపీలో కొత్త ఏడాది నుంచి నిరుద్యోగ భృతి!

AP-Unemployment-Allowance-Scheme-Benefits
Posted: 154 Days Ago
Views: 2820   

ఏపీలో నిరుద్యోగ భృతి ప‌ధ‌కాన్ని కొత్త ఏడాది నుంచి అమ‌లుచేసేందుకు స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేస్తోంది...టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో అన్ని హామీలు అమ‌ల్లోకి రాగా...నిరుద్యోగ భృతిని కూడా అమ‌లుచేసేందుకు సిద్ద‌మ‌వుతోంది...రాష్ట్రంలో ఎంత‌మంది నిరుద్యోగులున్నారు,ఏ ప్రాతిప‌దిక‌న భృతి చెల్లించాల‌నే దానిపై లెక్క‌లు తీస్తుంది స‌ర్కార్....

ఏపీలో టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి కూడా కీల‌క‌మైందే. ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు అవుతున్నా ఆ హామీ అమలు కాలేదు. ఎన్నికల హామీలపై ఫోకస్ చేసిన చంద్రబాబు..ఈ ఆర్ధిక సంవ‌త్సరం బ‌డ్జెట్లో నిరుద్యోగభృతికి 500 కోట్లు కేటాయించారు. వీలైనంత త్వర‌గా ప‌థ‌కాన్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారు.ఇప్పటికే దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమ‌లు చేసిన్పటికీ అనేక కార‌ణాల‌తో మ‌ధ్యలోనే ర‌ద్దు చేసాయి. దీంతో ప్రభుత్వం ముంద‌స్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

రాష్ట్రంలోని నిరుద్యోగుల లెక్క తేల్చేపనిలో పడ్డారు అధికారులు. ఇప్పటివ‌ర‌కూ జిల్లాల వారీగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ల‌లో దాదాపు 12 ల‌క్షల మంది నమోదు చేసుకున్నారు.ప్రభుత్వం నిర్వహించిన పల్స్ స‌ర్వే ఆధారంగానూ లెక్క తీస్తోంది. అయితే భృతి అమ‌లుకు క‌నీస విద్యార్హత ఇంట‌ర్మీడియ‌ట్ పెట్టాలా లేక డిగ్రీ పెట్టాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విదేశీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి రాగానే..నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు కానున్నాయి.

ఇక ఎవ‌రెవ‌రికి ఎంతెంత భృతి ఇవ్వాల‌నే దానిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెల‌కు క‌నీసం రెండువేల రూపాయిలు భృతిగా చెల్లిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉంది. అయితే అన్ని ర‌కాల విద్యార్హత‌లు ఉన్నవారికి ఒకే భృతి చెల్లించ‌డం వ‌ల్ల విమ‌ర్శలు వ‌స్తాయ‌ని భావిస్తోంది. ఇంట‌ర్ చదివిన వారికి క‌నీసం రెండువేలు,డిగ్రీ ఉన్నవారికి రెండున్నర వేల చొప్పున భృతి ఇవ్వడంపైనా ప‌రిశీల‌న చేస్తోంది. నిరుద్యోగుల‌ను ఊరికే కూర్చోబెట్టి డ‌బ్బులు ఇవ్వకుండా ..వారిని ప్రభుత్వ సామాజిక, స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయించాలనే ఆలోచన చేస్తోంది.

నిరుద్యోగ భృతి కోరుకునే వారు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారా...లేక ఎక్కడైనా ప‌నిచేస్తున్నారా అనే దానిపైనా త‌గిన స‌మాచారం తీసుకోనుంది స‌ర్కార్.మొత్తానికి మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న హామీని త్వర‌లోనే పట్టాలెక్కనుంది ఏపీ ప్రభుత్వం.

Tags: AP, Unemployment, Allowance, Scheme, Benefits


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials