Live News Now
  • రాజ్యసభలో టీడీపీ నిరసనల హోరు.. గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా
  • వాయిదాలపై ఏపీ ఎంపీల ఆగ్రహం.. కేంద్రం తీరుపై ఆందోళన పథం
  • విశాఖ అభివృద్ధిపై విష్ణు సెటైర్లు.. కేంద్రం టార్గెట్‌గా టీడీపీ కౌంటర్లు
  • లోక్‌పాల్‌పై పోరుబాట.. ఢిల్లీలో దీక్షకు దిగిన అన్నా హజారే
  • వర్షాకాలానికి కోయిల్‌ సాగర్‌ పూర్తి.. లక్ష ఎకరాలకు నీరిస్తామన్న హరీష్‌
  • వరకట్నం కేసులో హెడ్ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ దాడి
  • కేంద్రంతో మాటల్లేవ్‌.. చర్చల్లేవ్‌.. హోదాపై చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌
  • రాజ్యసభ విజయంతో టీఆర్ఎస్ లో జోష్‌.. రెబెల్స్‌పై వేటుకు టి-కాంగ్ కంప్లైంట్‌
  • ఎస్‌ఐ దాడితో కానిస్టేబుల్‌ సూసైడ్‌ అటెంప్ట్‌
  • అవిశ్వాసం ఎపిసోడ్‌లోకి కాంగ్రెస్‌.. మంగళవారం పరిణామాలపై ఆసక్తి
ScrollLogo పన్ను రద్దు.. బకాయిలు మాఫీ.. కల్లుగీత కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు ScrollLogo దేశవ్యాప్తంగా 25 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ ScrollLogo బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి.. తెరపైకి తెచ్చిన శరద్ యాదవ్ ScrollLogo ఆరోరోజూ తెలుగు ఎంపీల అవిశ్వాస పోరాటం ScrollLogo 8 బ్యాంకులు.. 1394 కోట్ల బకాయిలు.. టొటెం గ్రూప్‌లో సీబీఐ సోదాలు ScrollLogo రైతు సమస్యలపై టీ-బీజేపీ పోరు బాట... ScrollLogo అవుటర్‌పై కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి ScrollLogo హోదా పోరులో వెనకడుగు లేదు - ఏపీ సీఎం ScrollLogo రాములోరి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు 30న కల్యాణం ScrollLogo ఆగని టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే ఆందోళనలు.. నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ వాయిదా

రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్‌లోకి వెళ్ళేదెవరు..?

Revanth-Reddy's-Revolt-Episode
Posted: 154 Days Ago
Views: 109   

రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరికకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకుంటున్నారు. కొందరు నేతల్ని వ్యక్తిగతంగా కలుస్తుండగా.. మరికొందరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. నిన్నటి టి-టీడీపీ సమావేశం తర్వాత  రేవంత్ సైకిల్‌ దిగడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఆయనతోపాటు 20 మంది వరకూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వీరిలో 11 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రేవంత్ కోరుతున్నట్టు చెప్తున్నారు. ఈ ప్రతిపాదనకు AICC సుముఖత చూపించలేదు. తర్వాత చూద్దాం తరహాలో మెసేజ్ ఇచ్చారు. ఆరుగురికి  టికెట్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం. మిగతావారికి నామినేటెడ్ పదవులతో న్యాయం చేద్దామని హామీ ఇచ్చారంటున్నారు. ఈ వార్తలతో కాంగ్రెస్ సీనియర్లు ఉలిక్కిపడ్డారు. వలస నేతల కోసం తమ భవిష్యత్‌ను పణంగా పెడతామంటే ఎలాగని అధిష్టానానికి విన్నవించుకున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా కొన్ని సీట్లు తన వర్గానికే కేటాయించాలని రేవంత్‌రెడ్డి గట్టి ప్రతిపాదనే చేశారంటున్నారు. ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు టికెట్లపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు. అటు, జడ్చర్ల నుంచి రేవంత్ పోటీ చేస్తారనే వార్తలపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. జడ్చర్లలో మరో 10ఏళ్లు కూడా TRS పాగా వేస్తుందన్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే MLA పదవికి రాజీనామా చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న దాని చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials