Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

ఎత్తయిన టవర్‌తో కూడిన డిజైన్‌కు ఎక్కువ మంది ఆమోదం..ఈ నెల 25 న ఖరారు

Tower-Design-Voted-the-Highest-in-Proposed-AP-Assembly
Posted: 120 Days Ago
Views: 1468   

నవ్యాంధ్ర రాజధాని అసెంబ్లీ నమూనా‌ ఖరారు తుదిదశకు చేరుకుంది. CRDA వెబ్‌సైట్‌లో పెట్టిన 13 ఆప్షన్లలో... ఎత్తయిన టవర్‌తో కూడిన డిజైన్‌కు ఎక్కువ మంది ఆమోదం లభించింది. దీంతో ఈ డిజైన్‌నే చంద్రబాబు.. ఈ నెల 25 న ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన భవనాల డిజైన్ల ఖరారు ఓ కొలిక్కి వస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ కోసం ఓ డిజైన్ దాదాపుగా ఖరారైంది. గతంలో ప్రతిపాదించిన నమూనాలకు... రాజమౌళి, నార్మన్‌ ఫోస్టర్‌ బృందం కొన్ని సవరణలు చేశారు. ఫైనల్‌గా ఓ 13 డిజైన్లను ఎంపిక చేశారు. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ నెల 18 న వాటిని CRDA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పదమూడింటిలో 3 డిజైన్లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. భారీ టవర్‌తో కూడిన మొదటి డిజైన్‌కు అత్యధికుల మద్దతు లభించింది. దీనికి 719 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. ఇక రెండో డిజైన్‌కు 311 రెండో ప్రాధాన్యత ఓట్లు దక్కాయి. 13 వ డిజైన్‌కు 301 మంది ఓకే అన్నారు. ఇందులో టవర్‌తో కూడిన మొదటి డిజైన్‌కు అధికార వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. అసెంబ్లీ, శాసన మండలి కలిసి ఉండే ఈ భవనంపై ఈఫిల్‌ టవర్‌ తరహాలో ఓ నిర్మాణం ఉండనుంది. భవనంలోని పదో అంతస్తుపై ఈ టవర్‌ను నిర్మించాలని భావిస్తున్నారు. దీనిపై నుంచి చూస్తే సీడ్‌ కాపిటల్‌ మొత్తం కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సభ జరగని సమయంలో సందర్శకులను సైతం దీనిపై అనుమతించాలని భావిస్తున్నారు.
అందరి మద్దతు లభించిన ఒకటో డిజైన్‌ వైపే ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నెల 25 న చంద్రబాబు ఈ డిజైన్‌కు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials