Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

జ్యోతిర్లింగ క్షేత్రంలో అభివృద్ధి పనులు

Govt-Officials-Speed-Up-Srisailam-Temple-Development
Posted: 33 Days Ago
Views: 255   

జ్యోతిర్లింగ క్షేత్రం, భ్రమరాంబికా దేవి కొలువుదీరిన సన్నిధానం. ఏటా లక్షల్లో భక్తుల తాకిడి. ఇప్పుడు మల్లన్న సన్నిధికి మహర్దశ పట్టింది. ఎటు చూసినా ఆధునిక సదుపాయాలు. ఎక్కడ చూసినా పచ్చదనం. ఇదంతా మల్లన్న క్షేత్రంలో సాక్షాత్కారమైన దృశ్యం. అంతటి మహత్తర ఆలయ పరిసరాలు ఒకప్పుడు ధుమ్ము ధూళితో, ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో కనిపించేది. కానీ ఇప్పుడా పరిస్థితి అస్సలు లేదు. పూర్తిగా మారిపోయింది శ్రీశైలం ఆలయ పరిసరాలు. దుమ్ము లేపే రోడ్లు, తాగునీటికి, టాయిలెట్ సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్న పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నల్లమల అందాల నడుమ కొలువుదీరిన చెంచు మల్లన్న స్వయంభు లింగంగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబికా దేవి అమ్మవారు ఒకే చోట కొలువై భక్తులకు దర్శనమిస్తారు. పాతాళగంగంలో పుణ్య స్నానమాచరించి, మల్లన్నను దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో భక్తుల తాకిడి శ్రీశైలానికి అధికంగా ఉంటుంది. ఆదాయం కూడా భారీగానే ఉంటోంది. అయితే ఆదాయానికి తగ్గట్లు అభివృద్ది మాత్రం గతంలో జరగలేదు. శివశివా అనుకుంటూ దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది క్షేత్రం.

విభజన తర్వాత ఏపీలోని ఆలయాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల ఆలయం మోడల్ అన్ని చోట్లా అమలు చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్లు నిధులు కూడా కేటాయించారు. అందుకే శ్రీశైలం క్షేత్రం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. శ్రీశైలం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కృష్ణా పుష్కరాల సమయంలో రెండు సార్లు శ్రీశైలం వచ్చిన చంద్రబాబు ఆలయాన్ని దర్శించుకుని పరిసరాలను గమనించారు. అనంతరం అమరావతిలో పలు మార్లు జిల్లా నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. తిరుమలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాగే శ్రీశైలం సున్నిపెంటలనూ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా శాశ్వత అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నారాయణ భరత్ గుప్తాను ఈవోగా నియమించారు. దీంతో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఒకప్పుడు భక్తులు శ్రీశైలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొండ ప్రాంతం కావడంతో రాళ్లు రప్పలు తేలిన రోడ్లు దర్శనమిచ్చేవి. పాతాళగంగలో పుష్కలంగా నీరు ఉన్నా పైన మాత్రం తాగడానికి ఇబ్బందులుండేవి. భక్తులకు మినరల్ వాటర్ కాదు కాదా.. జనరల్ వాటర్ కూడా ఉండేది కాదు. ఇక టాయిలెట్ల పరిస్థితి మరీ అధ్వాన్నం. అంతా అపరిశుభ్రంగా ఉండేది. కాలి నడకన వచ్చిన వారు  కొండపైన ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందామన్నా ఆ పరిస్థితీ ఉండేది కాదు. 250 కోట్ల నిధులతో దేవస్థానం అధికారులు అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయం చుట్టూ రింగ్ రోడ్‌ నిర్మించారు. కొండపై దేవస్థానం పరిధిలో రోడ్లు వెడల్పు చేశారు. గుంతలన్నీ పూడ్చేసి సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో వసతులపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు, మరుగుదొడ్ల సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. దేవస్థానం పరిధిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అడుగడుగునా శుద్ధ జల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లతో మినరల్ వాటర్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడా వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. గతంలో టాయిలెట్స్ విషయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాజాగా ఎక్కడికక్కడ మోడ్రన్ బయో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. శ్రీశైలంను తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ కొనసాగుతోంది. ఉద్యోగ, వ్యాపారస్తుల నివాస సముదాయాలను సున్నిపెంటకు మార్చేస్తున్నారు. చెప్పాలంటే శ్రీశైలం దేవస్థానం పరిసరాల రూపు రేఖలు మొత్తంగా మారిపోతున్నాయి. శ్రీశైలం దేవస్థానం పరిసరాలు అద్దంలా కనిపించబోతున్నాయి. అంతా సిస్టమాటిక్‌గా పని జరుగుతోంది. కొండపై ఉన్న ఉద్యోగులు, వ్యాపారుల గృహాలను సున్నిపెంటకు మార్చేస్తున్నారు. అక్కడ దాదాపు 250 గృహాల నిర్మాణానికి మార్కింగ్‌లు ఇచ్చేశారు. త్వరలోనే శ్రీశైలంలోని ఉద్యోగుల నివాస గృహాలను కూల్చివేయనున్నారు. కొండపై స్థానికంగా నివాసముండే వారందరినీ సున్నిపెంటకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఆలయం ముందు వైపు ఉన్న షాపుల వ్యాపారులందరినీ ఖాళీ చేయిస్తున్నారు. వారందరికీ నూతంగా నిర్మించిన బహుళ అంతస్తుల షాపింగ్ సముదాయంలో ఒకే చోట ఉండేలా మార్చేస్తున్నారు. చాలా ఏళ్లకు శ్రీశైలం రూపు రేఖలు మారుతుండడంతో స్థానిక వ్యాపారులు కూడా అభివృద్ధిని కాంక్షిస్తున్నారు.

శ్రీశైలం అంటేనే గుర్తొచ్చేది నల్లమల అభయారణ్యం. కర్నూలు వైపు నుంచి వెళ్తే ఆత్మకూర్ అటవీ మార్గం ద్వారా రావాలి. ప్రకాశం జిల్లా వైపు నుంచి వచ్చినా దోర్నాల నుంచి శ్రీశైలం వరకు నల్లమ అందాలు మనసు దోచేస్తాయి. దీంతో అధికారులు కూడా కొండమీద ఇప్పుడు పచ్చదనం పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటుతున్నారు. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పలు పనులు కొనసాగుతున్నాయి. అన్నీ పూర్తయితే తిరుమల వెంకన్న తరహాలో కొత్త శోభను సంతరించుకోవడం ఖాయం.


Tags: Govt, Officials, Speed, Srisailam, Temple, Development


కడపలో భగ్గుమన్న పాతకక్షలు


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials