Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

రైతులకు అండగా టీకాంగ్రెస్ పోరాటం..

T-Cong-Leaders-Fires-On-TRS-Govt-Over-Farmers
Posted: 272 Days Ago
Views: 111   

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఏ అంశాన్నీ వదులుకోవడం లేదు హస్తం నేతలు. తెలంగాణ వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమం నిర్వహిస్తున్న టీ కాంగ్‌ నేతలు పరిహారం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. కుంతియా ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

తెలంగాణ ప్రభుత్వం టార్గెట్‌గా హస్తం నేతలు యుద్ధం మొదలు పెట్టారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న నేతలు.. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళుతున్నారు. వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ మండిపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధర, భీమా సొమ్ము అందడం లేదని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాతో కలిసి కాంగ్రెస్‌ నేతలు జడ్చర్లలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. బాలానగర్‌ మండలం ఇద్దమగడతండాలో ఎండిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందారం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అన్నదాతల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు రైతులు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు హస్తం నేతలు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మొదలైన ఈ యాత్ర తెలంగాణ మొత్తం నిర్వహిస్తామన్నారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతుల పక్షాన పోరాడతామన్నారు. ప్రాజెక్టుల పేరిట గత ఏడాది 20వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి మనసు రావడం లేదన్నారు. రైతులను ఆదుకోని ప్రభుత్వం.. బంగారు తెలంగాణ ఎలా సాధిస్తుందని కుంతియా ప్రశ్నించారు. నష్టపోయిన పత్తి పంటను పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు.. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తి రైతులకు ఎకరానికి 25వేలు పరిహారం ఇవ్వాలన్నారు.Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials