Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

కూకట్‌పల్లి వ్యక్తి చంద్రశేఖర్‌ సుపారీ మర్డర్

Chandrashekar-murdered-brutally
Posted: 240 Days Ago
Views: 352   

హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గత బుధవారం నుంచి అదృశ్యమైన చంద్రశేఖర్.. నిన్న రాత్రి.. కొర్రేములలో శవమై కనిపించాడు. డ్రగ్స్ మాఫియానే అతడ్ని అంతం చేయించినట్టు తెలుస్తోంది. నిందితుడు మత్స్యగిరి చెబుతున్న వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన బ్రిజ్ భూషణ్, సంతోష్ సింగ్‌లు మత్య్సగిరికి సుపారీ ఇచ్చి చంపించారు. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన బ్రిజ్ భూషణ్‌, సంతోష్ సింగ్‌లు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల వారి మీద DRI రైడ్స్ జరిగాయి. వారిద్దరిని అరెస్టు చేశారు. తమ సమాచారాన్ని ప్రత్యర్థి అయిన సోహైల్ అనే వ్యక్తికి చంద్రశేఖర్ చేరవేశాడని.. వారు భావించారు. సోహైల్ ఇచ్చిన ఫిర్యాదు వల్లే.. తమ మీద DRI రైడ్స్  జరిగాయని అనుకున్నారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న.. ఈ ఇద్దరూ.. చంద్రశేఖర్‌ను చంపాలని నిర్ణయించారు. మత్స్యగిరి అనే వ్యక్తి ద్వారా అతడ్ని హతమార్చినట్టు తెలుస్తోంది.

అయితే, ఈ వ్యవహారంలో చంద్రశేఖర్ పాత్ర ఏంటనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చంద్రశేఖర్‌కు, ఈ ఇండోర్ డ్రగ్స్ మాఫియాకు ఉన్న లింకులు ఏంటి? వారి మధ్య విబేధాలకు కారణం ఏంటి? అసలు బ్రిజ్ భూషణ్‌, సంతోష్ సింగ్‌లు ఎవరు? వారికి హైదరాబాద్‌కు డ్రగ్స్ లింకులు ఏమైనా ఉన్నాయా అని చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి సమాధానం వెతికేపనిలో ఉన్నారు పోలీసులు.

ఇక కొర్రేములలో ఓ చోట పాతిపెట్టిన చంద్రశేఖర్ శవాన్ని పోలీసులు బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే.. హైదరాబాద్‌లో చాలా పెద్ద డ్రగ్ మాఫియా ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నా.. బిజినెస్ మాత్రం చాపకింద నీరులా కొనసాగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials