Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

జగన్‌కు షాకిచ్చిన సీబీఐ కోర్టు..

No-Relief-for-YS-Jagan,-Break-To-YS-Jagan-Padayatra
Posted: 30 Days Ago
Views: 2282   

ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర ద్వారా వైసీపీ ఇమేజ్ పెంచాలనుకున్న జగన్‌కు.. సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రతీవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో.. పాదయాత్ర షెడ్యూల్‌పై మరోసారి కసరత్తు చేయనుంది వైసీపీ. అటు ప్రభుత్వం తీరుకు నిరసనగా.. అసెంబ్లీ సమావేశాలు బాయ్‌కాట్‌ చేయాలని భావిస్తోంది విపక్ష పార్టీ.

విరామం లేకుండా పాదయాత్ర చేసి.. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆశలకు బ్రేక్ వేసింది సీబీఐ కోర్టు. క్విడ్‌ప్రో కో కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది. పాదయాత్రకు వెళ్తుండడంతో.. ఆరు నెలల పాటు ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు జగన్. దీనిపై విచారణ జరిపిన కోర్టు..ఒక్కరోజు కోర్టుకు హాజరు కావడం వల్ల జరిగే నష్టమేమిటంటూ ప్రశ్నించింది. అటు సీబీఐ, ఈడీ కూడా విచారణ కీలక దశలో ఉన్నప్పుడు జగన్‌కు మినహాయింపు ఇవ్వడం సరికాదంటూ వాదనలు వినిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగనే కావడంతో.. మినహాయింపు ఇవ్వడం కష్టమని తేల్చేసింది కోర్టు. ఈ నిర్ణయాన్ని హైకోర్ట్‌లో సవాల్ చేయాలని భావిస్తున్నారు జగన్‌.

అటు.. పాదయాత్రకు సమయం దగ్గర పడుతుండడం, అసెంబ్లీ సమావేశాలకు ఏపీ సర్కార్ సిద్ధమవడంతో.. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై చర్చించారు జగన్. పాదయాత్రతో పాటు,  రైతు సమస్యలు, రుణమాఫీ, చంద్రబాబు విదేశీ పర్యటనలు, మెడికల్‌ సీట్లలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. పాదయాత్ర చేస్తామని ప్రకటించిన తేదీల్లోనే అసెంబ్లీని నిర్వహించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నేతలు. అసెంబ్లీకి హాజరు కావడం కన్నా .. బాయ్‌కాట్ చేయడమే మేలని అభిప్రాయపడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసి, నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి వైసీపీకి మైక్ ఇస్తామని ప్రభుత్వం నుంచి హామీ వస్తేనే.. అసెంబ్లీకి వెళ్దామంటూ ప్రతిపాదించారు. దీనిపై తుది నిర్ణయాన్ని ఈ నెల 26న జరిగే వైసీఎల్పీ సమావేశంలో తీసుకుందామన్నారు జగన్‌. మొత్తం మీద అసెంబ్లీ కన్నా జగన్ పాదయాత్రే ముఖ్యం కాబట్టి.. దాన్ని విజయవంతం చేయడంపైనే ఎక్కువగా వైసీపీ దృష్టి పెట్టేలా కనిపిస్తోంది.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials