Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఒక వైపు కన్న తల్లి.. మరో వైపు పెంచిన తల్లి..మధ్యలో నలుగుతున్న చిన్నారి

Mothers-Fight-For-Daughter
Posted: 238 Days Ago
Views: 2088   

ఆడపిల్లను పెంచడం ఇష్టంలేని ఓ తండ్రి చేసిన అరాచకానికి ఇద్దరు తల్లులు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికే తెలియకుండా పురిటిలోనే బిడ్డను అమ్మేసాడో తండ్రి. ఈ విషయం ఇన్నేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. పెంపుడు తల్లి నుంచి బిడ్డను తనకు ఇచ్చేయాలని కన్నతల్లి పట్టుబడుతుండడం, ఇద్దరు అమ్మలు పాప కోసం కన్నీరు పెడుతుండడం అందరినీ కలిచి వేస్తోంది.

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్నకిష్ణాపురం గ్రామానికి చెందిన మాలోత్‌ భావ్‌సింగ్‌, ఉమ దంపతులకు 2013లో ఆడపిల్ల పుట్టింది. 2015లో మళ్లీ ఆడ శిశువు జన్మించింది. దీంతో రెండో బిడ్డ పురిట్లోనే చనిపోయిందని భార్యకు చెప్పిన భావ్‌సింగ్‌, ఆమెకు తెలియకుండా చిన్నారిని ఇల్లెందుకు చెందిన వేముల రాజేంద్రప్రసాద్‌, స్వరూప దంపతులకు దత్తత ఇచ్చాడు. ఇల్లందుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడి సమక్షంలోనే డబ్బులు ఇచ్చుకోవడం, ఒప్పంద పత్రం రాసుకోవడం జరిగాయి. తీరా ఇప్పుడు అనుకోకుండా ఈ దత్తత విషయం బయటపడడంతో భావ్‌సింగ్‌ను భార్య ఉమ నిలదీసింది. పాపను దత్తత తీసుకున్న స్వరూప వద్దకు వెళ్లి పాపను ఇచ్చేయాలని కోరింది. ఆమె వద్ద తన్విత పేరుతో పెరుగుతున్న చిన్నారిని అప్పగించేయాలంటూ గొడవ పడింది.

ఈ ఇద్దరు తల్లులు బిడ్డ తమకు దక్కాలంటే తమకు దక్కాలని పట్టుబడుతుండం, పాప కోసం కన్నీరు పెడుతుండడం అందర్నీ కలిచి వేస్తోంది. అటు, ఈ గొడవ తేలే వరకూ పాపను ఐసీడీఎస్‌కు తరలించారు. దీంతో తల్లికి దూరమైన చిన్నారి కూడా ఏకబిగిన ఏడుస్తుండడం కంటతడిపెట్టిస్తోంది. 3 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న పాపను ఇవ్వలేనని పెంపుడు తల్లి అంటోంది. బలవంతంగా తన బిడ్డను లాక్కుంటే తనకు ఆత్మహత్యే దిక్కు అంటోంది. అటు, పురిట్లోనే తన బిడ్డను లాక్కుని తనకు అన్యాయం చేశారని, తన బిడ్డ తనకే కావాలని కన్నతల్లి చెప్తోంది. ఈ పంచాయతీ ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు అధికారులు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials