Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

శాటిలైట్ రైట్స్‌లో పవన్ తర్వాత స్థానం రామ్ చరణ్‌ దే

Satellite-rights-market-rate-High-for-Pawan-Kalyan,then-follows-Ramcharan
Posted: 199 Days Ago
Views: 1232   

స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్, హీరోల కాంబినేషన్లో వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందనే విషయం రంగస్థలం మూవీతో మరోసారి ప్రూవ్ అవుతోంది. ధృవ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా రంగస్థలం 1985. మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీకి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ డైరెక్టర్. సినిమా సినిమాకి వేరియేషన్ చూపించే సుకుమార్... రంగస్థలంతో ఈ సారి ముప్పై సంవత్సరాలు ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్ళబోతున్నాడు. 1985 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అందుకే సినిమా కోసం మెగా అభిమానులతో పాటు అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

రంగస్థలం మూవీ 1985 కాలం నాటి కథ కాబట్టి, అప్పటిలానే సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. గోదావరి పరిసరాల్లోనూ గ్రామాల్లో ఎక్కువ బాగం షూట్ జరిగింది. అలాగే పాటల్లోనూ అప్పటి కాలం గుర్తొచ్చేలా సెట్స్ వేస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ ఆర్ట్  వర్క్ కి సంబంధించిన స్టిల్స్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం రంగస్థంలో సాంగ్ షూటింగ్ జరుపుకుంది. ఆ స్టిల్ ని కూడా రిలీజ్ చేసింది టీమ్. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి గడ్డం, లుంగీతో కనిపించబోతున్నాడు చరణ్. ఇక చెర్రీకి జోడీగా సమంత నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

భారీ అంచనాలున్న రంగస్థలం 1985, వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రంగస్థలం 1985 అనే టైటిల్ పెట్టడంతో...ఈ సినిమా నాటకరంగానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుందనుకున్నారు. కానీ ఇది ఒక ఊరి పేరని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన స్టిల్ తో తెలుస్తోంది. అంటే 1985లో రంగస్థలం అనే ఊర్లో జరిగిన కథే ఈ రంగస్థలం సినిమా. సినిమాపై ఉన్న అంచనాల వల్ల శాటిలైట్ రైట్స్ కి డిమాండ్ ఎక్కువైంది. ఓ ఎంటర్ట్రైన్మెంట్ చానల్ రంగస్థలం రైట్స్ ని, దాదాపు 18 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలిని మినహాయిస్తే... దీనికంటే ముందు పవన్ కొత్త సినిమా అజ్ఞాతవాసి శాటిలైట్ రైట్స్ కి 21 కోట్లు దక్కాయి. శాటిలైట్ రైట్స్ విషయంలో పవన్ తర్వాత స్థానం చరణ్ దే...


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials