Live News Now
  • నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
  • అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్
  • సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
ScrollLogo వికారాబాద్: మార్చి 15నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి కావాలి మంత్రి మహేందర్ రెడ్డి ScrollLogo పంజాబ్ బ్యాంక్ స్కామ్: 9ఖరీదైన నీరవ్ మోడీ కార్లు సీజ్, వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్. ScrollLogo పార్టీ పేరు ప్రకటించిన కమల్‌హాసన్.. మక్కళ్ నీది మయ్యమ్.. ScrollLogo మక్కళ్ నీది మయ్యమ్ అంటే అర్ధం.... జస్టిస్ ఫర్ పీపుల్.. అంటే ప్రజలకు న్యాయం..! ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

టీమిండియాదే టీ20 సిరీస్‌.. కివీస్‌ను చిత్తుచేసిన కోహ్లీసేన

India-vs-New-Zealand,-3rd-T20,-full-cricket-score:-IND-win-by-6-runs,-clinch-series-2-1
Posted: 108 Days Ago
Views: 728   

హోం సీజన్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో టీ ట్వంటీ సిరీస్‌ డిసైడర్‌గా అదరగొట్టిన కోహ్లీసేన సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో కివీస్‌పై టీ ట్వంటీల్లో చెత్త రికార్డును మెరుగుపరుచుకుంది.

ఊహించినట్టుగానే సిరీస్ డిసైడర్ మూడో టీ ట్వంటీకి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఓపెనర్లతో పాటు కోహ్లీ కూడా నిరాశపరిచాడు. అయితే మనీశ్ పాండే, పాండ్యా మెరుపులతో కోహ్లీసేన 67 పరుగులు చేసింది. బ్యాటింగ్ పిచ్‌పై వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ సాధించలేకపోయింది.

ఛేజింగ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కూడా తడబడుతూ సాగింది. తొలి ఓవర్లనే భువనేశ్వర్‌ వికెట్ తీస్తే... బూమ్రా పదునైన బౌలింగ్‌తో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. భారత పేసర్ల ధాటికి కివీస్ పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. అయితే వికెట్లు పడుతున్నా... ఆ జట్టు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. చివరి మూడు ఓవర్లలో విజయం కోసం 32 పరుగులు చేయాల్సి ఉండగా..బూమ్రా, చహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పాండ్యా గాయపడినా... స్లో బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు.

ఈ విజయంతో కివీస్‌పై తొలిసారి టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ తమ రికార్డును మెరుగుపరుచుకుంది. వన్డే సిరీస్‌లో గట్టి పోటీ ఇచ్చిన న్యూజిలాండ్, షార్ట్ ఫార్మేట్‌లోనూ ఆకట్టుకున్నప్పటకీ కోహ్లీసేన జోరును అడ్డుకోలేకపోయింది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials