Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

ఊపిరి తీసుకోవడానికి ఇబ్డంది పడుతున్న ఢిల్లీ..

Story-On-Delhi-Air-Pollution,-Daily-Mirror
Posted: 197 Days Ago
Views: 1213   

ఆయువు జనం వాయువు తీస్తోంది. దేశరాజధానిలో కాలుష్యం.. ప్రజలకు నడిరోడ్డుపై నరకం చూపిస్తోంది. ఢిల్లీ నగరం తల్లడిల్లుతోంది. ఊరూ వాడా ఉక్కిరిబిక్కిరవుతోంది. పొల్యూషన్, పొగమంచుల యుద్ధం తప్పడం లేదు. పక్క రాష్ట్రాల పొగతో పరిస్థితి మరీ దారుణంగా అయ్యింది. ఇదంతా మనుషుల పాపమా? పాలకుల రాజకీయమా?
ఢిల్లీలో పరిస్థితిని మార్చలేమా? 

ఢిల్లీకి ఊపిరాడడం లేదు. ఉక్కిరిబిక్కిరి తప్పడం లేదు. ముక్కు మూసుకోకుండా బయటకు రాలేరు. మాస్కు లేకుండా క్షణం కూడా ఉండలేరు. వాహనాలకేమో సరి-బేసి సంఖ్య విధానం అంటున్నారు. ఇంతకీ ఢిల్లీ ఊపిరి తీసుకోవాలంటే ఏం చేయాలి? గాలిలో స్వచ్ఛత పెరగాలంటే రాజధాని ఎలా ఉండాలి? ఢిల్లీకి ఊపిరాడుతుందా? 

ఎదురుగా ఏముందో కనిపిస్తేనే కదా ఆగాలో వెళ్లాలో తెలుస్తుంది. ఢిల్లీలో పరిస్థితి ఇలా ఉంది. అంటే ఆ స్థాయిలో కాలుష్యం పెరిగిపోయింది. తప్పు మీదంటే మీదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదులాడుకుంటున్నాయి. పిల్లలైతే.. స్కూలుకెళ్లినా, క్లాసులో ఉన్నా మాస్కులు వేసుకోవాల్సి వస్తోంది. గడ్డి తగలబెట్టడం వల్లే ఇదంతా అని ఢిల్లీ అంటోంది. మరి దీనికి పంజాబ్ ఏం చెప్పింది?

గాలి కాలుష్యం పెరగడం వల్ల మన దేశంలో ఏటా ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? 18 లక్షలు. అంటే ఈ సమాజమే వారిని చంపేస్తోంది. ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేనంతగా గాలిని కలుషితం చేసింది ఎవరు? రాజకీయ నాయకులా? పారిశ్రామికవేత్తలా? లేకపోతే.. దీనికి కూడా ప్రజలే కారణం అని నెపాన్ని వాళ్లమీదకు నెట్టేస్తారా? లేక సమస్యకు పరిష్కారం చూపిస్తారా?

గాలి, నీరు ఉచిత వస్తువులని చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. నీరు కలుషితం కావడంతో డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు గాలి కూడా కలుషితం కావడంతో దానిని కూడా డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందేనా? ఢిల్లీలో పరిస్థితి చూస్తే.. ఆ రోజు దగ్గర్లోనే ఉన్నట్టుంది. ఇప్పటికే మన దేశంలో కొన్ని చోట్ల ఈ బాధ తప్పడం లేదు. ప్రభుత్వాలు రాజకీయాలు మాని.. ప్రజల ఆరోగ్యం ఫోకస్ పెడితేనే సమస్య పరిష్కారమవుతుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials