Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

మూడేళ్ల కొడుకును అత్యంత పాశవికంగా హత్య చేసిన కన్న తండ్రి

Father-Kills-His-3-year-old-Son-In-Vishaka
Posted: 98 Days Ago
Views: 1031   

మద్యం మహమ్మారి మనుషులను మృగాలుగా మార్చేస్తోంది. రాక్షసుల కంటే దారుణంగా తయారు చేసి.. మానవ సంబంధాలను దిగజారుస్తోంది. విశాఖ జిల్లాలో కన్న తండ్రే కర్కోటకుడిలా మారి... మూడేళ్ల కొడుకును అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన.. అందర్నీ కలచివేస్తోంది.

అనకాపల్లి మండలం మారేడుపూడిలో ఈ దారుణం జరిగింది. మద్యం మత్తులో బాబూరావు అనే వ్యక్తి.. మూడేళ్ల కొడుకును హత్య చేశాడు. గునపంతో చిన్నారిని పొడిచి చంపేశాడు. ఫూటుగా తాగిన మత్తులో.. కన్న కొడుకున్న సంగతి కూడా మర్చిపోయిన బాబూరావు.. చిన్నారి శరీరంపై గునపంతో ఇష్టమొచ్చినట్లు పొడిచి చంపేశాడు. శరీరమంతా గునపంతో చిల్లులు పడేలా.. పాశవికంగా హత్య చేశాడు. తనను నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి ఏడుస్తున్నాడన్న కారణంతో... చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు.

రోజూ మద్యం తాగి వచ్చి బాబూరావు పెడుతున్న టార్చర్‌ను తట్టుకోలేక.. అతడి భార్య మూడేళ్ల కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తగారింటికి కూడా మద్యం సేవించి వెళ్లిన బాబూరావు.. మరోసారి భార్యతో గొడవపడ్డాడు. నా కొడుకును నాకు ఇచ్చేయాలంటూ.. బాబును తీసుకుని మారేడుపూడి తిరిగొచ్చాడు. అయితే అర్ధరాత్రి కొడుకు ఏడవడంతో.. మద్యం మత్తులో ఉన్న బాబూరావు మృగంలా మారిపోయాడు. తనను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడంటూ... గునపంతో పొడిచి చిన్నారిని హత్య చేశాడు. బాలుడి తలతో పాటు శరీరమంతా గునపంతో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న మారేడుపూడి వచ్చిన తల్లి.. గుండెలవిసేలా రోదిస్తోంది. నిన్నటిదాకా తన ఒడిలో ఆడుకున్న కొడుకు.. ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials