Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

ముక్కు కోస్తామంటూ కర్ణిసేన .. డోంట్ కేర్ అంటున్న దీపిక

karni-sena-threatens-chop-off-deepika-padukones-nose
Posted: 96 Days Ago
Views: 1080   

దేశంలో సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి మూవీ సెగలు రగులుతూనే ఉన్నాయి. మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తున్నాయి. నిన్నటివరకూ అసలు సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని పద్మావతీ టీమ్‌ను హెచ్చరించిన కర్ణి సేన.. దీపిక ట్వీట్లతో మరింత చెలరేగిపోయారు. తాజాగా దీపిక ముక్కు కోస్తామంటూ కర్ణిసేన కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు.

జైపూర్‌లో కర్ణిసేన పద్మావతి సినిమా విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంది. లీడ్ రోల్ చేసిన దీపికా పడుకునే తమకు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడంపై సీరియస్ అయ్యింది. రాజ్‌పుత్‌లు మహిళలపై ఎప్పుడూ చేయి చేసుకోలేదన్న కర్ణిసేన కార్యకర్తలు.. అవసరమైతే నీ ముక్కు మాత్రం కోసి తీరుతామని హెచ్చరించారు. తమ పూర్వీకులు రక్తంతో రాసిన చరిత్రను కించపరిస్తే అంగీకరించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు దుబాయ్ అండర్ వరల్డ్ నుంచి పెట్టుబడులు అందాయని కర్ణిసేన ఆరోపించింది. భన్సాలీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, దేశం దిగజారిపోతోందన్న దీపిక స్వయంగా దిగాజారిపోయేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, లక్షల్లో ఏకమై సినిమాను అడ్డుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఇటు ఈ సినిమా రిలీజ్ కాబోయే థియేటర్ యజమానులకు కూడా బెదిరింపులు తీవ్రం అయ్యాయి. దీంతో డిసెంబర్ 1న పద్మావతి థియేటర్లలోకి రావడం సందేహంగా మారింది.

పద్మావతి మూవీని విడుదల కాబోతున్న డిసెంబర్ ఫస్ట్‌న కర్ణిసేన భారత్ బంద్ పాటించేందుకు సిద్ధమైంది. లక్షలాదిమందితో ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇటు యూపీ ప్రభుత్వం ఈ సినిమా శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని కేంద్రాన్ని హెచ్చరించింది. విడుదల రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందంటూ కేంద్ర సమాచార శాఖకు యూపీ హోంశాఖ లేఖ రాసింది. సినిమాకు అనుమతి ఇచ్చే ముందు ప్రజల మనోభావాలు గుర్తించాలని సూచించింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials