Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

ఖాకీ సినిమా రివ్యూ

Kaki-Movie-Review
Posted: 95 Days Ago
Views: 2098   

చిత్రం : ‘ఖాకి’
నటీనటులు: కార్తి - రకుల్ ప్రీత్ సింగ్ - అభిమన్యు సింగ్ - బోస్ వెంకట్ తదితరులు
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: ఉమేష్ గుప్తా - సుభాష్ గుప్తా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హెచ్.వినోద్


తమిళ హీరో అన్న టైటిల్ కనిపించని హీరో కార్తిక్, ఊపిరి తో తెలుగు వారికి మరింత దగ్గరైన ఈ హీరో కి తెలుగు లో ఆదరణ ఎక్కువే. అన్నయ్య సింగం గా మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటే ఒక రియలిస్టిక్ కథతో కార్తి తొలిసారి పోలీస్ గా తెలుగు  ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి కార్తి చూపిన పోలీస్ పవర్ ఎంటో చూద్దాం..
కథ:
ధీరజ్ (కార్తి) నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. లంచాలు తీసుకోకుండా.. తన దగ్గరికి వచ్చే ప్రతి కేసును సులభంగా పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదిస్తాడు. ట్రైనింగ్ పిరియడ్ లోనే తన ఇంటి ఎదురుగా ఉండే లక్ష్మి(రకుల్) తో ప్రేమలో పడతాడు.ఆమె భర్తగా  అతను డిజిపిగా బాధ్యతలు ఒక సమయంలో తీసుకుంటాడు.  చార్జి తీసుకున్న
మొదట్లో ఒక డెకాయిట్ కేసు తన ముందుకు వస్తుంది. అత్యంత దారుణంగా ఇంట్లో వారిని చంపి వారి ఇంటిని దోచుకుంటారు నేరస్థులు. అయితే ఆ కేస్ లో ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించిన అతనికి చాలా చిక్కుముడులు ఎదరవుతాయి. వాటిని పరిష్కరించేందుకు ఒక వేలు ముద్రలు తప్ప మరో ఆధారం ఉండదు. దీంతో ధీరజ్ ఆ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి తన పై ఆఫీసర్స్ సహాయం కోరతాడు. అప్పుడు అతను ఒక నేర ప్రవృత్తి ని ఆచారంగా మార్చుకున్న ఒక ముఠాను వెతుకున్నానని అర్ధం అవుతుంది. ఆ కేస్ లో లోతుగా  వెళ్ళేకొద్ది అన్నీ దారులు మూసుకున్నట్లు కనిపిస్తుంటాయి. ఇంతలో ఆ ముఠా తన కోలీగ్ ఇంటిపై దాడి చేస్తుంది అడ్డు పడిన ధీరజ్ భార్యను గాయపరుస్తుంది. దీంతో ధీరజ్ ఆ కేస్ విషయం లో అమీతుమీ తెల్చుకునేందుకు సిద్ధం అవుతాడు. ఆధారాలు లేని ఆ హంతకుల ముఠా ను అతను ఎలా పట్టుకున్నాడు ఈ ఆపరేషన్ ఎన్నేళ్ళు సాగింది అనేది మిగిలిన కథ..?
కథనం :
పోలీస్ అనగానే మనకు కనిపించే లౌడ్ యాక్షన్ పక్కన పెట్టి ఒక రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమాను నడిపాడు దర్శకుడు వినోద్. అతని డిటైలింగ్ వర్క్ కి ఎవరైనా హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే. దొంగలు  పుట్టిన మూలాలు నుండి పోలీస్ ఎదుర్కునే పరిస్థితులు వరకూ తెరపైకి తెచ్చాడు. అతను చేసిన రీసెర్చ్ వర్క్ ఇంతకు ముందు సినిమా కోసం ఎవరూ చేసుండరేమో అనిపించింది. దానికి తగ్గట్టుగా కార్తి ధీరజ్ పాత్రగా మారిపోయాడు. అతని సిన్సియారిటీ కళ్లల్లో కనిపిస్తుంది. తొక్కిపెడుతున్న పరిస్థితులు తెచ్చే అసహానం అతని బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది. ప్రతిదీ డైలాగ్ గానే, సీన్ గానే మార్చాల్సిన పనిలేదు కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ పాత్రలోని ఎమోషన్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తాయి. కార్తి లాంటి ఆర్టిస్ట్ దొరికి నప్పుడు ఆ పని మరింత సులభతరం అవుతుంది. అందుకే కార్తి నటన ఈ మూవీ కి హైలెట్ గా నిలిచింది. ఇక దొంగలు వారి జీవన విధానం  తెలుసుకునేందుకు కార్తి అండ్ గ్యాంగ్ చేసిన పరిశోథన పోలీస్ అంటే గౌరవాన్ని మరో పక్క వామ్మో అన్న ఫీలింగ్ ని కల్పిస్తుంది. రోడ్ మీద తిరుగుతూ, ఎప్పటి కప్పుడు స్థావరాలు మార్చుతూ దేశం అంతటా తిరిగే దొంగలను పట్టుకోవాలంటే కొన్నింటిని కాదు, అన్నింటిని వదిలేయాలి. ఆ వదిలేసే వాటిలో ఇల్లు, భార్య తో పాటు చిన్న చిన్న సంతోషాలు కడుపుకు ఇంత బోజనం కూడా ఉంటాయి. వీటిని కూడా దృశ్యాలుగా మలిచాడు దర్శకుడు. కార్తి నటన తో అవి మరింత హార్ట్ టచ్చింగ్ మారాయి. కానీ ఒక్కసారి కథలోని అసలు పాయింట్ తెరమీదికి వచ్చాక దర్శకుడు ఇంకే విషయాలనూ పట్టించుకోలేదు. పూర్తిగా ఆ కేసు మీదే కథాకథనాల్ని నడిపించాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో దోపిడీ దొంగల ముఠాల నేపథ్యం ఏంటి.. వాళ్లు దోచుకునే తీరు ఎలా ఉంటుంది.. వాళ్లు నెట్ వర్క్ ఎలా మెయింటైన్ చేస్తారు.. పోలీసులకు గ్యాంగులోని వాళ్లు చిక్కితే ఎంత మొండిగా వ్యవహరిస్తారు.. ఇలా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా.. చాలా వాస్తవికంగా తెరమీద చూపించిన తీరు మెప్పిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో కార్తి విజృంభించాడు. రాజస్థాన్ లోని ఒక ఊరిలో తోడేళ్ళ తరహాలో దాడి చేస్తున్న వారిని వారి పంథాలోనే చంపే యాక్షన్ సన్నివేశం సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. మనుషుల్ని కిరాతకంగా చంపే వారిని విచారిస్తున్నప్పుడు మానవ హాక్కువ ల వారి చేసే విచారణలు పోలీసులు మనోధైర్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో చూపించాడు దర్శకుడు.

ఒకడు మంచి వాళ్లను చెడ్డవాళ్ల నుండి కాపాడుతుంటే సిస్టమ్ నుండి సొసైటి వరకూ అతనికి కలిపించే అవరోధాలు, వాటి మద్య నిజాయితీతో అతను చేసే ప్రయత్నాలు గొప్పగా అనిపించాయి. హీరో పాత్ర పరిచయం.. రొమాంటిక్ ట్రాక్ కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ.. హీరో ముందుకు దోపిడీ కేసు వచ్చినప్పటి నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ ముందు దోపిడీ దొంగల భీభత్సాన్ని చూపిస్తూ.. హీరో వాళ్లను రీచ్ అయ్యే ప్రయత్నం చేసే సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి.జిబ్రాన్ సంగీతం పర్వాలేదు.నేపథ్య సంగీతం మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేస్తుంది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం సినిమాకు పెద్ద ప్లస్. నార్త్ ఇండియాలో నడిచే సన్నివేశాల్ని చాలా బాగా చిత్రీకరించాడు.  ఒక కేసును పరిశీలించడానికి దర్శకుడు తీసుకున్న సమయం ఎక్కువే. అదే ఖాకి కి ప్రధాన సమస్య . రియలిస్టిక్ పోలీస్ థ్రిల్లర్ ని చూడాలనుకునే వారికి ఖాకి మస్ట్ వాచ్ ఫిల్మ్.

చివరగా: పోలీస్ పవర్ ని రియలిస్టిక్ అప్రోచ్ తో చూపిన సినిమా. రెగ్యులర్ పోలీస్ పాత్రలకుండే వేగం ఉండదు, నిజాయితీ ఉంటుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials