Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

స్కూలుకి వెళ్తున్న మేక..!

Goat-To-School,-Telangana
Posted: 213 Days Ago
Views: 860   

గోట్... టు స్కూల్. ఇదేంటి గో టు స్కూల్ అంటారు కదా! గోట్ అంటున్నారేంటని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. ఎందుకంటే మేక కూడా స్కూలుకు వెళ్తోంది. ప్రార్థనకు ముందే పాఠశాలలో హాజరవుతుంది. ఇంటర్వల్‌లో నీళ్లు తాగుతుంది. లంచ్‌ బ్రేక్‌లో మేత మేస్తుంది. ఫైనల్‌ బెల్ కొట్టగానే ఇంటికి వెళ్తుంది. టైమ్‌ టేబుల్‌ను కూడా ఫాలోఅవుతోంది. కానీ పుస్తకం ముట్టదు. అక్షరం ముక్క రాదు. నోరు తెరిస్తే మే అనడం తప్ప మరెమీ నేర్చుకోలేదు. ఇంతకీ ఈ మేక కథేంటి?

ఆ మేక రోజూ స్కూలుకు వెళ్తోంది. పాఠశాల ఆవరణలో చెట్టుకింద ఉంటుంది. ఇంటర్‌వెల్‌‌లో నీళ్లు తాగుతుంది. లంచ్‌ బ్రేక్‌లో మేత మేస్తుంది. సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. స్కూలు వదలగానే  ఈ బాలుడు మహేశ్‌, అతడి చెల్లెళ్లతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఆదివారం, ఇతర సెలవుదినాల్లో తప్ప... మిగతా అన్ని రోజులు ఇది బుద్ధిగా స్కూలుకు వెళ్తుంది..

ఇక్కడో ట్విస్ట్ ఉంది. మేక స్కూలుకు వెళ్లేది చదువుకోడానికి కాదు. తన ఫ్రెండ్‌ మహేశ్‌ కోసం. ఒక్కమాటలో చెప్పాలంటే మహేశ్‌ స్కూలు మానకుండా ఈ గోట్‌... కూడా బడి బాట పట్టింది. ఇదే ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆసక్తిని రేపుతోంది...

ఆ మేక- మహేశ్ కథ తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి. మహేశ్ స్వగ్రామం గద్వాల మండలం జంగంపల్లి. ఇతడి అమ్మ శిరీష, నాన్న నారాయణ. మహేశ్‌కు ఇద్దరు చెల్లెళ్లున్నారు. ఈ బాలుడు ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్నాడు. నారాయణ, శిరీష దంపతులకు జమ్మిచెడు జమ్ములమ్మకు ఒక మొక్కుంది. అది తీర్చుకోడానికి ఇదిగో ఈ మేకపోతును కొన్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. మొక్కు తీర్చుకునేలోపు దాన్ని మేతకు తీసుకెళ్లాలి. దంపతులిద్దరూ కూలికి వెళ్తారు. అందుకోసం మహేశ్‌ను బడి మాన్పించి మేకను మేపడానికి పంపించారు..
  
మహేశ్‌ బడికి రాకపోవడంతో టీచర్లు ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకుని ఓ ఐడియా చెప్పారు. అది ఈ బాలుడి జీవితాన్నే మార్చేసింది. స్కూలు మానేయడం ఎందుకు బడికి వచ్చేప్పుడు మేకను తెచ్చి స్కూలు వద్ద కట్టేయాలి. ఇంటర్వెల్‌లో దానికి నీళ్లు పెట్టాలి. లంచ్‌ బ్రేక్‌లో మేత వేయాలి. సాయంత్రం తీసుకెళ్లాలి. 
 
ఇదేదో బాగానే ఉందని మహేశ్ తల్లిదండ్రులు ఓకే అన్నారు. ఇంకేం మహేశ్‌ ఎంచక్కా బడికి వెళ్తున్నాడు. తన ఇద్దరు చెల్లెళ్లు సుప్రియ, శ్రావణితోపాటు ఈ మేకను వెంటబెట్టుకెళ్తున్నాడు. అక్కడ దానికి వేప, ఇతర చెట్ల కొమ్మలను ఆహారంగా వేసి... నీళ్లు పెట్టి దాని కడుపు నింపుతున్నాడు. తను బుద్దిగా చదువుకుంటున్నాడు. 

సాయంత్రం తనతోపాటే మేకను ఇంటికి తీసుకెళ్తాడు.. బడిమాన్పించి పనులకు పంపే తల్లిదండ్రుల కళ్లు తెరిపించిన ఓ చక్కని ఉదాహరణ ఇది. సమస్యకు పరిష్కారం పిల్లల చదువు మాన్పించడం కాదు. దానికి సొల్యూషన్ వెతకాలి. ఇదే మేక- మహేశ్ కథలోని నీతి.   


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials