Live News Now
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 సీట్లపై ఉత్కంఠ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు వరుసగా తొలగుతున్న అడ్డంకులు..
  • రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలన్న హరీష్
  • జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. పీకలదాకా తాగి యువతి బీభత్సం.
ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ScrollLogo నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు ScrollLogo కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ScrollLogo అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ ScrollLogo సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్

మరుగుదొడ్ల పథకంలో గోల్‌మాల్‌ .. కోటి రూపాయలకు పైగా నిధులు గల్లంతు

toilet-scam-in-chittoor-district
Posted: 97 Days Ago
Views: 451   

చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన ఇంటింటికి మరుగుదొడ్ల పథకంలో గోల్‌మాల్‌ బయటపడింది. ఈ పథకం కింద విడుదలైన నిధులు పక్కదారి పట్టాయి. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తైనా... లబ్ధిదారులకు రావాల్సిన డబ్బు మాత్రం అందలేదు. ఈ వ్యవహారంపై బాధితులు టీవీ5ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై జరిపిన విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. నిధులు వచ్చి నెలలు గడిచినా...అవి అకౌంట్లలో పడలేదని తేలింది. తీరా ఆరా తీస్తే... వేరే వారి ఖాతాల్లో పడినట్లు బయటపడింది.
జిల్లా వ్యాప్తంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ మరుగుదొడ్ల పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ముందుగానే లబ్దిదారులు మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. పులిచర్ల మండలంలో 6వేల 356 టాయిలెట్లు మంజూరయ్యాయి. అయితే వాటిలో 4వేల 146 నిర్మాణం పూర్తయ్యాయి. వీటికి సంబంధించి కోటి రూపాయలకు పైగా నిధులు విడుదలయ్యాయి.
అయితే టాయిలెట్లు నిర్మించి నెలలు గడిచినా... డబ్బు మాత్రం అకౌంట్లలో జమ కాలేదు. ఈ వ్యవహారంపై లబ్దిదారులు ఆరా తీయగా... డబ్బు ఎప్పుడో అకౌంట్లలో పడ్డట్లు అధికారులు రికార్డుల చూపించారు. షాకైన జనాలు... తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా... గందరగోళం ఏర్పడింది. వెంటనే బాధితులు టీవీ5ని ఆశ్రయించారు. జరిగిన వ్యవహారాన్ని చెప్పుకొచ్చారు.
టీవీ5 విచారణలో అసలు విషయం బయటపడింది. లబ్దిదారుల పేరుతో రావాల్సి నిధులు మాత్రం వచ్చాయి. అయితే డబ్బు మాత్రం వేరేవాళ్ల అకౌంట్లలో జమయ్యాయి. ఈ విషయాన్ని టీవీ5 అధికారుల దృష్టికి తీసుకెళ్లగా... విచారణ చేపట్టారు. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చే పనిలో ఉన్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials