Live News Now
  • నీరవ్‌ మోడీకి చెందిన అత్యంత ఖరీదైన వాచ్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
  • అదనపు వివరాలు ఇస్తేనే హెచ్1బీ వీసా.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్
  • సఫారీలతో భారత్ డూ ఆర్ డై మ్యాచ్.. ఇవాళ టీ20 సిరీస్‌ ఫైనల్ ఫైట్
  • తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌టీ.. 8 వేల792 పోస్టుల భర్తీకి పరీక్ష
  • మరింత బలపడిన భారత్, కెనడా బంధం.. ఉగ్రవాదంపై పోరు.. ఆరు అంశాలపై ఒప్పందం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పేలిన రిమోట్‌కార్.. చిద్రమైన చిన్నారి చేయి.. పరిస్థితి విషమం
  • పట్టాదారు పాసుపుస్తకాలకు ఆధార్‌ లింక్.. లేకుంటే బినామీ ఆస్తులుగా గుర్తిస్తామన్న కేసీఆర్
  • సీఐఐ సదస్సుకు ముస్తాబైన విశాఖ.. 3 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం..
  • ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ రగడ.. బీజేపి విమర్శలకు టీడీపీ కౌంటర్లు
ScrollLogo వికారాబాద్: మార్చి 15నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి కావాలి మంత్రి మహేందర్ రెడ్డి ScrollLogo పంజాబ్ బ్యాంక్ స్కామ్: 9ఖరీదైన నీరవ్ మోడీ కార్లు సీజ్, వాటిలో రోల్స్ రాయిస్, బెంజ్. ScrollLogo పార్టీ పేరు ప్రకటించిన కమల్‌హాసన్.. మక్కళ్ నీది మయ్యమ్.. ScrollLogo మక్కళ్ నీది మయ్యమ్ అంటే అర్ధం.... జస్టిస్ ఫర్ పీపుల్.. అంటే ప్రజలకు న్యాయం..! ScrollLogo ముంబై: గోవా సీఎం పారికర్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ScrollLogo జోధ్‌పూర్‌: విదేశీ పర్యాటకురాలిపై ఆగంతకుల లైంగిక వేధింపులు ScrollLogo నిరుద్యోగులకు 2 వేల భృతి.. కొత్త పథకానికి కేసీఆర్ కసరత్తు ScrollLogo 'జీఎస్టీ' కేసులో వర్మకు స్వల్ప ఊరట.. విచారణ మార్చి తొలివారానికి వాయిదా ScrollLogo రాష్ట్రపతిభవన్‌లో కెనడా ప్రధాని.. సాదర స్వాగతం పలికిన మోడీ ScrollLogo సుష్మా స్వరాజ్‌తో కెనడా ప్రధాని భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

వెలగపూడిలో ప్రత్యేక హోదాపై మిన్నంటిన ఆందోళనలు

Top-Story
Posted: 96 Days Ago
Views: 285   

గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ప్రత్యేక హోదా నినాదం మరోసారి వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రజా సంఘాలు చలో అసెంబ్లీ పేరుతో ఆందోళనకు దిగాయి. విపక్షనేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రజా సంకల్పయాత్రలో ఇదే నినాదంతో వినిపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. నీతిఆయోగ్ క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అయినా.. జాతీయ ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేశారు. అయినా హోదాకు ఏమాత్రం తగ్గకుండా సాయం చేస్తామని చెప్పిన అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా బీజేపీ రాష్ట్ర నాయకులు ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సహా రాజధానికి సాయం చేస్తామన్నారు. రాయితీలు, పన్నుల్లో మినహాయింపులు ఇస్తామన్నారు. హోదా కంటే ఎక్కువే సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దీంతో సహజంగానే హోదా అంశం పక్కకు పోయింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి స్పెషల్ స్టేటస్ తెర మీదకు వస్తోంది. జగన్‌ను ఎన్నికల్లో గెలిపించే మంత్రం ఇదేనని నమ్ముతున్నారు. స్పెషల్ స్టేటస్ నినాదం ఎంత సజీవంగా ఉంటే.. అంత రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. అటు ప్రజా సంఘాలు కూడా తమ ఉనికి కాపాడుకునేందుకు హోదా అంశంపై యుద్ధం ప్రకటించాయి. స్పెషల్ స్టేటస్ ముగిసిన అంకమని భావిస్తున్న సమయంలో మళ్లీ కొందరు పనిగట్టుకుని అగ్గి రాజేస్తున్నారా? అసెంబ్లీలో హోదా గురించి మాట్లాడకుండా తెరవెనకుండి రాజకీయంగా ఉద్యమాలు నడిపిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలు నిజమేనా? అసలు ఏపీలో ఆధార్, ఓటరుకార్డు లేని వారు.. ఉదయం విమానంలో వచ్చి...సాయంత్రం విమానంలో పోయే వాళ్లు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అడుగుతున్నవారి స్థానికతను లోకేష్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడకు వచ్చి ఆందోళన చేయడాన్ని లోకేష్ తప్పుబడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికి హోదాపై వార్ తప్పదా? ఇదే అంశం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారబోతుందా?


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials