Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

ఆదివాసీ-లంబాడాల మధ్య ముదిరిన విభేదాలు

High-Tension-in-Adilabad-District,-Adivasis-Assaulted
Posted: 91 Days Ago
Views: 153   

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఆదివాసీ తెగలకు, లంబాడ తెగలకు మధ్య వర్గ విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఇవాళ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు తమ హక్కులను కాలరాస్తున్నారని.. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా.. తమకు ఏజెన్సీలో రక్షణ కల్పించాలని లంబాడాలు కోరుతున్నారు. ఈ క్రమంలో వీరి ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రెండ్రోజుల కిందట ఉట్నూరు ఎక్స్‌రోడ్‌లో ఇద్దరు ఆదివాసీ యువకులపై లంబాడ తెగకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. వీరిపై దాడిని ఖండించిన ఆదివాసీ నాయకులు.. ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఏజెన్సీలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని కోరారు. దీంతో మన్యంలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పిస్తోంది. అటు.. ఏజెన్సీలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.

గత నెలలో ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్‌లోని కొమురం భీం మ్యూజియంలో గిరిజన తెగకు చెందిన విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందులో లంబాడ తెగకు చెందిన శాంఖిమాత విగ్రహాన్ని ఆదివాసీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో వీరి మధ్య వైరం పెరిగింది. బాధ్యులను అరెస్ట్ చేయాలని ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఐతే.. ఆదివాసీల అరెస్టులను నిరసిస్తూ.. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. మరుసటి రోజు ఏజెన్సీలోని తమ బడుల్లో లంబాడ ఉపాధ్యాయులను రానివ్వమని.. వారి బోధన తమకొద్దని తీర్మానం చేశారు. దీనికి ప్రతిగా లంబాడ ఉపాధ్యాయులు తమకు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. దీనిపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ ఎస్పీ శ్రీనివాస్‌.. ఉట్నూరు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఐతే.. లంబాడాలు తమను వ్యతిరేకిస్తూ.. కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. ఆదివాసీలు ఇంద్రవెల్లి అమరుల స్థూపం నుంచి ఉట్నూరు ఐటీడీఏ వరకు 20 వేల మందితో మహాపాదయాత్ర నిర్వహించారు. కేసులు ఎత్తివేసి.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల భారీ ర్యాలీ తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు ఏజెన్సీలో 144 సెక్షన్ విధించారు.

ప్రభుత్వం గిరిజనులకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను ఎస్టీల పేరిట లంబాడాలు ఎక్కువగా అనుభవిస్తున్నారని, అవగాహనారాహిత్యం కారణంగా తాము నష్టపోతున్నామని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సౌకర్యాలను అనుభవిస్తున్నారని ఆందోళనలు చేస్తున్నారు. నెల రోజులుగా ఆదిలాబాద్‌ జిల్లాలో  ఆందోళనలు విస్తరించాయి. ఐతే.. తాము దుర్భర జీవితాలు గడుపుతున్నామని, రాజ్యాంగం నిర్దేశించిన లక్షణాలన్నీ కలిగి ఉన్నామని, రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వ ఫలాలు అందుకుంటున్నామని లంబాడాలు చెబుతున్నారు. తాము జనాభా రీత్యా ఆదివాసులకంటే నాలుగురెట్లు అధికంగా ఉన్నామని... రిజర్వేషన్ల ద్వారా లభించిన విద్యావకాశాలను సద్వినియోగం చేసుకొంటున్నామని చెబుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials