Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

యువరాజే రారాజు కాబోతున్నాడు

Rahul-Gandhi-President-Daily-Mirror
Posted: 186 Days Ago
Views: 1207   

కాంగ్రెస్ కు యువరాజే రారాజు కాబోతున్నారు. సారొస్తారు సరే... ఆయన గెలుపు మంత్రం ఏంటి? ఇప్పటి దాకా ఆయనవి అన్నీ ఫ్లాపు షోలే.. మరి హిట్ ఎప్పుడు? బీజేపీకి ముందు మోడీ... వెనుక అమిత్ షా. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? పార్టీపై పట్టు కోసం రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు? 

మాట్లాడితే ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలు. మరి పార్టీని పట్టించుకునేదెప్పుడు? క్షేత్రస్థాయిలో దానిపై దృష్టి పెట్టేదెప్పుడు? ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఫలితం సున్నా. అక్కడక్కడ పాస్ మార్కులు వచ్చాయి. ఇలా అయితే ఫస్ట్ ర్యాంక్ కొట్టేదెప్పుడు? అధికార పీఠం ఎక్కేదెప్పుడు? రాహుల్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుంది సరే. మరి మిత్రపక్షాలు ఓకే అంటాయా?

కాంగ్రెస్ ది.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. దానికి 47 ఏళ్ల యువనేత రారాజు అవుతున్నారు. ఇంతవరకు ఓకే. కాని అవతల ఉన్నది పాలిటిక్స్ ని పరుగులు పెట్టిస్తున్న నేతలు. పాత పార్టీకి కొత్త కలరింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. కానీ ఆ పనిని కాంగ్రెస్ చేయలేకపోయింది. పోనీ ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకుందా అంటే అదీ లేదు. మరిప్పుడు రాహుల్.. ఎలాంటి కొత్త స్కెచ్ లు వేయబోతున్నారు?

గేమ్ లో గెలవాలంటే రేంజ్ పెంచాలి. దానికి ఛేంజ్ కావాలి. రాహుల్ ఆ ప్రయత్నంలోనే ఉన్నారా? పార్టీ గెలవాలంటే.. కేవలం అధ్యక్షుడు మారితే సరిపోదు. కింది స్థాయి నుంచి వ్యవస్థ అంతా పటిష్టంగా ఉండాలి. అప్పుడే టీమ్ పర్ ఫెక్ట్ గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడలాగే ఉందా? ఈవిషయంలో యువనేత చేయబోతే మార్పులేంటి? 

ఒకటే లక్ష్యం. ఒకటే గమ్యం. కాని గత మూడున్నరేళ్లుగా అది గురి తప్పింది. అందుకే ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టింది. జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుందాం. మరి రేపటి మాటేంటి? కాంగ్రెస్ కు కొత్త రారాజుగా బాధ్యతలు తీసుకోబోతున్న రాహుల్ ఎలాంటి మార్పులు చేయబోతున్నారు. ఎందుకంటే.. ప్రజలతో తమ పార్టీకి సంబంధాలు తెగిపోయాయని చెప్పిన నేత.. వాటిని ఎలా పునరుద్దరిస్తారో చూడాలి. దానిని బట్టి రాహుల్ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందని చెప్పాలి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials