Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల్లో కురిచేటి కుటుంబం విజయం

Kuricheti-Couple-won-Singapore-Telugu-Samajam-Elections
Posted: 235 Days Ago
Views: 550   

2017-2019 సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికల బరిలో కురిచేటి కుటుంబం విజయాన్ని సాధించి తెలుగు ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి నాయకత్వంలో కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి గెలుపొందగా.. ఆయన భార్య కురిచేటి స్వాతి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎమ్మార్వో కె.సామిరెడ్డి, జమున కుమారుడయిన జ్యోతీశ్వర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మంగళంపాడుకు చెందిన బొమ్మిరెడ్డి పార్థివరెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించిన కురిచేటి స్వాతి వివాహబంధంతో ఒక్కటై ఉద్యోగరీత్యా సింగపూర్‌లో ఉంటున్నారు. కొన్నేళ్లుగా సింగపూర్‌లోని ప్రజల స్థితిగతులను తెలుసుకుని వారికి సేవలందించేందుకు నిర్ణయించుకున్నారు. కోటిరెడ్డి కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటారు. తల్లిదండ్రులకు, జన్మభూమికి పేరు ప్రతిష్ఠలు తెచ్చేలా సింగపూర్‌లో తమ సేవలను అందిస్తామని భార్యాభర్తలిద్దరూ తెలిపారు.  
మదనపల్లిలోని జ్ఞానోదయ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్న జ్యోతీశ్వర్‌రెడ్డి, గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్, మదనపల్లి మిట్స్‌లో, హైదరాబాద్ బండ్లగూడలోని మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశారు. మంగలంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేసిన కురిచేటి స్వాతి, పద్మావతి జూనియర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసీఏ పూర్తి చేశారు. విద్యావంతులైన ఈ దంపతులిద్దరూ చిన్నవయస్సులోనే అత్యంత ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని మొదటి విడతలోనే గెలుపొందారు. తమను ఆదరాభిమానాలతో ఈ ఎన్నికల్లో గెలిపించినందుకు సింగపూర్ తెలుగు ప్రజలకు, అధ్యక్షులు కోటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసేందుకు నిరంతరం కృషిచేస్తామన్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials