Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

రివ్యూ: 'ఆక్సిజన్' కంటే సిగరెట్ పొగ ఎక్కువైంది

oxygen-movie-review
Posted: 232 Days Ago
Views: 7831   

రివ్యూ : ఆక్సిజన్
తారాగణం : గోపీచంద్, అనూఇమ్మానుయేల్, రాశిఖన్నా, జగపతిబాబు, సితార, శ్యాం, బ్రహ్మాజీ, అలీ, బాహుబలి ప్రభాకర్.... 
ఎడిటింగ్ : ఎస్బీ ఉద్దవ్
సినిమాటోగ్రఫీ : చోటా కె నాయుడు, వెట్రీ
సంగీతం : యువన్ శంకర్ రాజా
నిర్మాత : ఎస్. ఐశ్వర్య, జ్యోతికృష్ణ
దర్శకత్వం : ఏఎమ్. జ్యోతికృష్ణ

రెండేళ్ల క్రితమే ప్రారంభమైన చిత్రం ఆక్సీజన్. అప్పట్లో ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకుందీ మూవీ. రెండేళ్లుగా సా..గుతూ వచ్చిన ఆక్సీజన్ ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఆఖరికి ఈ రోజు విడుదలైంది. అంచనాలు పెంచడంలో కొంత వరకు సక్సెస్ అయిన టీమ్.. ముందు నుంచీ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరి వారి కాన్ఫిడెన్స్ నిజమైందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.. 

కథ :
కృష్ణ ప్రసాద్(గోపీచంద్) అనాథ. అమెరికాలో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తుంటాడు. ఓ పెద్ద కుటుంబంలోని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునేందుకు ఇండియా వస్తాడు. ఓ పల్లెటూరులో ఉండే రఘుపతి కూతురుతో పెళ్లికి సిద్ధపడతాడు. కానీ పెళ్లికూతురు శ్రుతికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఎలాగైనా అతన్ని వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోగా ముహూర్తం దగ్గరపడిందని కుటుంబం అంతా బట్టలు కొనడనాకి సిటీకి బయలుదేరతారు. మధ్యలో ఆ ఫ్యామిలీపై కొందరు అటాక్ చేస్తారు. ఆ అటాక్ నుంచి వారిని కృష్ణప్రసాద్ కాపాడతాడు. ఆ కుటుంబానికి ముందు నుంచీ ప్రాణహాని ఉంటుంది.. కాపాడిన తర్వాత నుంచి అతనిపై ఇష్టం పెంచుకుంటుంది శ్రుతి. కానీ అతనితో పర్సనల్ గా మాట్లాడాలని ఊరుబటయకు తీసుకువెళుతుంది. తోడుగా ఆమె కుటుంబం సభ్యులు కూడా వస్తారు. అక్కడ అనుకోకుండా మళ్లీ అటాక్ జరుగుతుంది. అయితే ఈ సారి వేరే వారు కాదు.. ఆ కుటుంబ సభ్యులను కృష్ణప్రసాదే హత్య చేస్తాడు. దీంతో శ్రుతి షాక్ అయ్యి అతని నిజ స్వరూపం తెలుసుకుంటుంది. అసలు కృష్ణ ప్రసాద్ ఎవరు..? ఎందుకు పెళ్లికొడుకులా వచ్చి అందర్నీ చంపాలనుకుంటున్నాడు అనేది మిగతా కథ..

విశ్లేషణ
ఆక్సీజన్.. ఇది లేనిదే ఏ ప్రాణీ బతకలేదు. అలాంటి టైటిల్ ను సినిమాకు పెట్టారంటే ఏదో పెద్ద కథే ఉంటుందనుకుంటాం. కానీ కథా పాయింట్ బావున్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. మూడు నిమిషాల ముఖేష్ యాడ్ ను రెండున్నర గంటల సినిమాగా చెప్పాడా అనిపిస్తుంది.. అంతా అయిపోయాక. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్నీ వృథా అయిన ఇంటర్వెల్ బ్యాంగ్ తో తేల్చేశాడు దర్శకుడు. అంటే కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ ను హైలెట్ చేయడం కోసమే ఫస్ట్ హాఫ్ లో అనేక టైమ్ పాస్ సీన్స్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే అతను అనుకున్నట్టుగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. అందుకోసం అంత టైమ్ తీసుకోవడమే అస్సలు బాలేదు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే ఊహించినట్టుగానే ఫ్లాష్ బ్యాక్. కృష్ణ ప్రసాద్ అసలు పేరు సంజీవ్. ఆర్మీ కమాండర్. పెళ్లి చేసుకోవడానికి సెలవుల్లో వస్తాడు. తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లికి ఒప్పిస్తాడు. ఈ లోగా ఐఐటిలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన అతని తమ్ముడికి క్యాన్సర్ అని తెలుస్తుంది. అది తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుంటాడు. కానీ అతనికి క్యాన్సర్ రావడానికి టైగర్ సిగరెట్స్ లో ఉన్న డ్రగ్సే అన్న విషయం తెలుస్తుంది సంజీవ్ కు. ఆ మిస్టరీని ఛేదించి ఆ సిగరెట్ ఫ్యాక్టరీని మూసేయిస్తాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ఆ ఫ్యాక్టరీ ఓనర్స్.. సంజీవ్ ఫ్యామిలీతో పాటు అతని ప్రేయసిని కూడా చంపేస్తారు. ఆ ఫ్యామిలీయేఈ ఊర్లో ఉండే రఘుపతి ఫ్యామిలీ.. ఎక్కడో విలేజ్ లో ఉండే ఓ ఫ్యామిలీ ఇంత పెద్ద ఇల్లీగల్ బిజినెస్ డీల్ చేస్తుందనే విషయాన్ని సమర్థవంతంగా కన్వే చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అలాగే ఆ సిగరెట్ ఎపిసోడ్స్ అన్నీ పొగ ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీని వల్ల దర్శకుడు ఉద్దేశ్యం మంచిదే అయినా.. స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండటంతో ఆక్సీజన్ కూడా మరో రొటీన్ మూవీగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ కూడా కొత్తదేం కాదు.. ఆ మధ్య ఎన్టీఆర్ చేసిన రభస ప్లాటే ఇది. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా తమిళ్ స్టార్ విజయ్ తుపాకీ నుంచి ఇన్స్ స్పైర్ అయినట్టున్నాయి తప్ప కొత్తగా ఏం లేవు. లవ్ లో వచ్చిన ఆర్మీ ఆఫీసర్ ఇక్కడ అక్రమాలపై పోరాడ్డం అనే పాయింట్ కూడా పాతదే. కాకపోతే సిగరెట్ వల్ల యూత్ ఎంతలా లాస్ అవుతున్నారో చెప్పే సీన్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయి. తమ మేథస్సును దేశానికి ఉపయోగించాల్సిన యూత్.. ఇలా వ్యసనాలతో అర్థాంతరంగా చనిపోవద్దు .. కావాలంటే మాతోపాటు వచ్చి బోర్డర్ లో యుద్ధం చేయమంటూ సంజీవ్ చెప్పే మాటలూ ఆకట్టుకుంటాయి. వాస్తవానికి ఇది ఓ షార్ట్ ఫిలిమ్ తో పోయే పాయింట్. దాన్ని గోపీచంద్ లాంటి హీరోతో చేయాలనుకున్నప్పుడు కథనంపై ఇంకాస్త శ్రద్ధపెట్టి ఉండాల్సింది. 
ఆర్టిస్టుల పరంగా గోపీచంద్ కు ఇది టైలర్ మేడ్ రోల్. సో కొత్తగా ఏమీ లేదు. కానీ అతని లుక్కు బావుంది. హీరోయిన్లిద్దరూ జస్ట్ ఓకే అనిపించుకున్నారు. జగపతిబాబు పాత్ర వేస్ట్. అతనికంటే శ్యామ్ పాత్ర బెటర్. అలాగే జగపతి ఫ్యామిలీలో ఉండే పాత్రలన్నీ వెరీ రొటీన్. అలీ కామెడీ ఏమాత్రం నవ్వించలేకపోయింది. ఇక ‘నటించారు’ అని చెప్పడానికి ఏ ఆర్టిస్ట్ కూ పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. 

టెక్నికల్ గా: 
యువన్ శంకర్ రాజా సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. కానీ అతని స్థాయికి తగ్గ ఆల్బమ్ అయితే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నిరాశపరుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటర్ కు చాలా పనుంది. సినిమాటోగ్రఫీ ఒకే. మాటలు యావరేజ్. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.. ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. గ్రాఫిక్స్ జస్ట్ ఓకే.

ప్లస్ పాయింట్స్: 
గోపీచంద్ 
చివరి 20నిమిషాలు 
రెండు పాటలు 
యాక్షన్ ఎపిసోడ్స్ 
ఇంటర్వెల్ బ్యాంగ్ 

మైనస్ పాయింట్స్   : 
కథ, కథనం
ఫస్ట్ హాఫ్ 
సంగీతం 
ఎడిటింగ్ 
కామెడీ 


చివరగా : ఆక్సీజన్ కంటే సిగరెట్ పొగ ఎక్కువైంది. 

రేటింగ్ : 2.5/5


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials