Posted: 142 Days Ago
Views: 395
చరిత్ర సృష్టించడానికి మరో ఏడు వికెట్ల దూరంలో ఉంది భారత్. వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్ విజయాలను అందుకున్న ఆస్ట్రేలియా జట్టుతో సమంగా నిలబడనుంది. ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్టులో ఇవాళ ఐదో రోజు లంకేయుల భరతం పడితే.. భారత్ ఖాతాలో రికార్డు చేరుతుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిపత్యంలో ఉంది టీమిండియా. బౌలర్లు కొంచెం శ్రమిస్తే.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ అనూహ్య పరిణామాలతో మ్యాచ్ డ్రాగా ముగిసినా కూడా టెస్టు సిరీస్ గెలవడం ఖాయం.
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. భారత్ నిర్దేశించిన 410 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులు 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీతున్నారు. నాల్గో రోజు ఆట ముగిసేసమయానికి దనంజయ డిసిల్వా, మాథ్యూస్ క్రీజ్‌లో ఉన్నారు. ఇంకా 379 పరుగులు వెనుకబడి ఉన్న లంకేయులు చివరి రోజు ఆటలో సుదీర్ఘ పోరాటం చేస్తే కానీ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే.