Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

ఆదర్శమూర్తి రాఘవ.. నిర్మాతగా ఎందరికో స్ఫూర్తి

Centenarian-Producer-K-Raghava
Posted: 43 Days Ago
Views: 142   

కె రాఘవ... వయసు సెంచరీ దాటింది. ఆరేళ్ల వయసుకే మూకీ సినిమాతో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి కళామతల్లి ఒడిలోనే ఎదిగాడు. ట్రాలీ పుల్లర్ గా మొదలైన జీవితం.. ఇద్దరు శతాధిక చిత్ర దర్శకులను పరిచయం చేసేంత వరకూ ఎదిగింది. భారతీయ సినిమా మూకీ నుంచి టాకీకి ఎదిగిన విధానం దగ్గరుండి గమనించిన అతికొద్దిమందిలో ఒకరు రాఘవగారు. ఇవాళ  నిర్మాత కె రాఘవ గారు పుట్టిన రోజు.. 

గమ్యం తెలియని ప్రయాణం.. అని చాలాసార్లు విని ఉంటాం. అలాగే ప్రయాణం మొదలుపెట్టిన రాఘవ.. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు నిర్మాత రూపంగా కనిపించే వ్యక్తి రాఘవగారు. రాశిలో తక్కువైనా వాసిలో మిన్నయైన చిత్రాలు నిర్మించిన నిక్కచ్చి నిర్మాత రాఘవగారు. పొట్టచేత పట్టుకుని ఆరేళ్ల వయసులోనే కాకినాడ నుంచి కలకత్తాకు వెళ్లాడు రాఘవ. అట్టడుగు నుంచి మొదలై సినిమా రంగంలో అత్యున్నతంగా చెప్పే నిర్మాత స్థాయికి చేరిన విధానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.

కొన్నాళ్ల తర్వాత కలకత్తా నుంచి మకాం విజయవాడకు మార్చారు. మూకీ సినిమాలకు వెనక నుంచి వ్యాఖ్యానం చెప్పే కస్తూరి శివరావుతో పాటు రాఘవ కూడా మద్రాస్ వెళ్లిపోయారు. మద్రాస్ లో సి పుల్లయ్యగారిని కలుసుకుని సినిమాల్లో చిన్న వేషాలు మొదలుకుని, స్టంట్ మాస్టర్ గా, డూప్ గా, ఫైటర్ గా చేసుకుంటూ ఓ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ కాగలిగారు. అలా వచ్చిన డబ్బులతోనే మరొకరిని కలుపుకుని చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. 

ప్రొడక్షన్ మేనేజర్ గా రష్యా వెళ్లిన రాఘవ అక్కడ కొన్ని ఫారిన్ మూవీస్ చూశారు. వాటి స్ఫూర్తితో ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో 1963లో జెగత్ కిలాడీలు రూపొందించారు. నాలుగు లక్షలతో నిర్మించిన ఆ చిత్రం ఘనవిజయం సాధించి రాఘవకు మంచి లాభాల్నిచ్చింది. తర్వాత ఎస్వీఆర్ తోనే జగత్ జెట్టీలు తీశారు. అదీ హిట్ అయింది. వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే ఏ నిర్మాతకైనా ఉత్సాహం వస్తుంది. అదే ఉత్సాహంతో సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మళ్లీ జెగత్ జెంత్రీలు తీశాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్.. అయితే జగత్ జెట్టీలు, జగత్ కంత్రీలు చిత్రాలకు దాసరి నారాయణ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడమే కాదు, రచయితగానూ సత్తా చాటారు.. మూడు సినిమాల తర్వాత తన సహ నిర్మాతతో అభిప్రాయభేదాల కారణంగా విడిపోయిన రాఘవ తర్వాత సొంతంగా ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించారు.. 

ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి సినిమానే ఓ చారిత్రక సినిమాకు నాంది పలికింది. తనకు బాగా కలిసొచ్చిన ఎస్వీ రంగారావే ప్రధాన పాత్రలో కమెడియన్ రాజబాబు హీరోగా వచ్చిన ఆ చిత్రం తాతామనవడు. ఆ చిత్రం అఖండ విజయం సాధించి ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ గురించి ఘనంగా చెప్పుకునేలా చేసింది. తాతామనవడు సూపర్ హిట్ తర్వాత దాసరితోనే సంసారం సాగరం, తూర్పుపడమర తీశారు. ఇవీ మంచి విజయాలే సాధించాయి. ముఖ్యంగా తూర్పుపడమర చిత్రం ఘనవిజయం సాధించింది. నాటి ప్రేక్షకులకు ఆ సబ్జెక్ట్ అప్పటికి కొత్తగా అనిపించింది.. అలాగే ఇందులోని శివరంజనీ నవరాగిణీ అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. అలా ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ లో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన దాసరి శతాధిక చిత్రాల దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.

తాతామనవడు హిట్ తో దాసరి వద్ద పని చేయాలని కలలు కని వాటిని సాధించుకున్న కోడి రామకృష్ణ అనుకున్నట్టుగానే ఆయన వద్ద అసిస్టెంట్ గా చేరాడు. కోడి రామకృష్ణ టాలెంట్ పసిగట్టిన రాఘవ తన బ్యానర్ లోనే అతన్ని దర్శకుడిని చేయాలని ఫిక్స్ అయ్యారు. చిరంజీవి, మాధవి, గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కి, అఖండ విజయం సాధించిన ఆ సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.. చిరంజీవికి ఇదే తొలి సూపర్ డూపర్ హిట్.. ఈ సినిమా ఆ రోజుల్లో ఐదువందల రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తో చిరంజీవి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ కోడి రామకృష్ణతోనే తరంగిణి తీశారు. అయితే ఈ చిత్రానికి ముందుగా చిరంజీవినే తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పటికే అతనికి మాస్ ఇమేజ్ రావడంతో కొత్తవాడైన సుమన్ ను తీసుకున్నారు. తరంగిణి సూపర్ హిట్ టాక్ తో యేడాది పాటు ఆడింది. దీంతో హీరోగా సుమన్ కు బెస్ట్ ప్లాట్ ఫామ్ అయితే అటు తను పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ కూడా వందకు పైగా చిత్రాలు డైరెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 

కె. రాఘవ సంఖ్యా పరంగా చేసిన సినిమాలు తక్కువే. కానీ కథా పరంగా రాఘవ చిత్రాలు ఉత్తమంగా నిలుస్తాయి. అలాగే తన బ్యానర్ లో చాలామంది కొత్తవారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.. కానీ పరిశ్రమలో వచ్చిన పోకడల వల్ల చాలాకాలం క్రితమే నిర్మాణ రంగం నుంచి నిష్క్రమించారు. అందుకే ఒకప్పుడు చెన్నైలో రఘుపతివెంకయ్య ఆఫీస్ లో పనిచేసిన రాఘవ నిర్మాతగా ఆయన పేర నెలకొల్పిన అవార్డ్ నే అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. ఇప్పటికే తనకు వందేళ్లు పూర్తయ్యాయని చెప్పుకుంటున్న ఈ శతాధిక వృద్ధునికి బర్త్ డే విషెస్ మరోసారి. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials