Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

కాళేశ్వరం పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్

CM-KCR-Review-On-Kaleshwaram-Project-Works
Posted: 223 Days Ago
Views: 249   

రెండు రోజుల పాటు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.  భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదిదర అంశాల్లో ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి కాళేశ్వరం పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి చివరి దశ పర్యావరణ త్వరలో వస్తుందని, డిజైన్లు ఇతర నిర్మాణాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కోర్టులో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నామన్నారు.
కాళేశ్వరం ద్వారా మిషన్ భగీరథకు నీళ్లు అందించాలన్నారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్ సహా ఏడు పాత జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మిషన్ భగీరథ పథకం గొప్పగా నడుస్తోందన్న ముఖ్యమంత్రి మరో నెలన్నరలో 98 శాతం గ్రామాలకు నీళ్లు అందుతాయన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథ లాంటి పథకాల అమలు చేయాలనుకుంటున్నాయని, తెలంగాణ సహకారం కోరుతున్నాయని చెప్పారు. అవసరమైతే  అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపుతామని చెప్పారు.
ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి నీళ్లిస్తారని మంత్రి హరీశ్ రావు, అధికారులపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని సీఎం సూచించారు. దానికి అనుగణంగానే మంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో హరీశ్ రావు బాగా పనిచేశారని, ఇకపై ప్రతి పది రోజులకు ఒక సారి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. నేలకోసారి తాను కూడా పనులను పర్యవేకిస్తానని తెలిపారు.  విద్యుత్ శాఖ  వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తుందని తెలిపారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials