Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

బంజారహిల్స్ లో అర్థరాత్రి ఉద్రిక్తత

Task-Force-Police-Raids-on-Hookah-Centres-in-Hyderabad
Posted: 138 Days Ago
Views: 3560   

హైదరాబాద్‌లో పబ్ నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా పబ్‌లో కొనసాగిస్తూ ..రూల్స్‌కు విరుద్దంగా మైనర్లను కూడ పబ్‌ల్లోకి అనుమతిస్తున్నారు. రాత్రి 12 దాటినా కొనసాగుతున్న బంజారాహిల్స్  లోని పేపర్ బ్లూ పబ్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పబ్‌  మూసేయాలంటూ ధర్నాకు దిగారు.

ఆందోళన చేస్తున్న బీజీవైం కార్యకర్తలను పబ్ నిర్వాహకులు, బౌన్సర్లు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రూల్స్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఏం చేస్తారో చేసుకోమంటూ ఎదురుదాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కడినుంచి పంపించేశారు.

రూల్స్‌కు విరుద్దంగా అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న పబ్‌ను మూసేయాలని, నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు.

అయితే పబ్ నిర్వాహకులు మాత్రం రూల్స్ ప్రకారం పబ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మైనర్లను అనుమతించడం లేదని చెప్పారు. ఐడీ కార్డ్స్ పరిశీలించాకే ఎవరినైనా అనుమతిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో పబ్‌ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నా..నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials