Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

ప్రకాశం జిల్లాలో నరహంతకుడు

Woman's-murderer-nabbed
Posted: 223 Days Ago
Views: 879   

అప్పుల్లో కూరుకు పోయాడు... సంక్రాంతిలోపు బాకీలన్నీ తీర్చాలనుకున్నాడు. ఏం చేయాలని అని ఆలోచించాడు. ఆ కంత్రీ మైండ్‌లో ఓ ఖతర్నాక్‌ ఆలోచన వచ్చింది. ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టి.. ఒంటిపై బంగారం దోచుకున్నాడు. ఆరేళ్లుగా ఎందరినో చంపేశాడు. మరో ఇద్దరిని మట్టుబెట్టేందుకు స్కెచ్ వేశాడు. కానీ.. పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు.

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నలదలపూరు. ఊళ్లో అందినకాడికి అప్పులు చేశాడు. బంధువుల వద్ద బాకీ పడ్డాడు. పొలం అమ్ముకుని ఇల్లు కట్టి మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. బాకీలు తీర్చమని అప్పులువాళ్లు ఒత్తిడి చేయడంతో హంతకుడిగా మారాడు. ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వాళ్లపై ఎటాక్ చేసి చంపేశాడు. వృద్ధ మహిళల్ని చంపేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లాడు. ఇలా ఎందరినో మట్టుబెట్టాడు. .

ప్రకాశం జిల్లా కందుకూరులో నవంబర్11 గుర్రావారిపాలెంకు చెందిన సోమేపల్లి లక్ష్మీదేవి మర్డర్ జరిగింది. అంతకు ముందు సెప్టెంబర్‌లో సింహాద్రి నగర్ కు చెందిన కొల్లా నారాయణమ్మ హత్యకు గురైంది. వరుసగా వృద్ధ మహిళల మర్డర్లు జరుగుతుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేశారు.  టెక్నాలజీ ఉపయోగించుకుని హంతకుడు వెంకటరావుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అప్పులు తీర్చేందుకు ఇలా ఎందరినో చంపాడని తెలిసి పోలీసులే షాకయ్యారు. లక్ష్మీదేవి, కొల్లానారాయణమ్మలే కాకుండా ఆరేళ్ల క్రితం కూడా 70ఏళ్ల లక్ష్మమ్మను హతమార్చానని విచారణలో పోలీసుకు తెలిపాడు.  

ఈ నరరూప రాక్షసుడు సంక్రాంతి లోపు మిగతా అప్పులు తీర్చాలని మరో ఇద్దరు మహిళలను చంపాలని డిసైడయ్యాడు. ఈలోపే పోలీసులు చిక్కాడు. కిల్లర్ వెంకటరావును అరెస్ట్ చేసిన పోలీసులు..19సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీర్చేందుకు..అమాయకులను పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials