Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

భర్త ప్లేస్ లో ప్రియుడుని తీసుకోచ్చేందుకు.. ప్రియుడి ముఖం పై యాసిడ్ పోసి...

woman-kills-husband-to-replace-lover-in-husband-place
Posted: 222 Days Ago
Views: 4927   

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య కేసును పోలీసులు చేధించారు. మృతుడి భార్య స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సుధాకర్‌ రెడ్డిని చంపి పడేసిన ప్రదేశాన్ని కనుగొన్నారు. భార్య స్వాతి, ప్రియుడు రాజేశ్‌ చేతిలో హత్యకు గురైన సుధాకర్‌ రెడ్డి మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని ఫతేపూర్‌ అడవుల్లో ఖననం చేశారు.
పోలీసుల విచారణలో స్వాతి నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన జిల్లా పోలీసులు.. సుధాకర్‌ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని చూసిన మృతుడి తల్లి దండ్రులు.. గుండెలు పగిలేలా రోధించారు.
తెలకపల్లికి చెందిన స్వాతికి సుధాకర్‌రెడ్డితో ఏడేళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. స్వాతికి రాజేష్‌ అనే ఫిజియోథెరపిస్ట్‌తో పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేయాలనుకుంది. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను తన ఇంట్లోనే హత్యచేసింది. మృతదేహాన్ని నవాబుపేట మండలం ఫతేపూర్‌ మైసమ్మ అటవీ ప్రాంతంలో పడేసింది. ఆ తర్వాత సుధాకర్‌రెడ్డి స్థానంలో రాజేష్‌ను తీసుకొచ్చేందుకు  ప్రియుడి ముఖంపై యాసిడ్‌ పోసింది. ఆ‌ ముఖం గుర్తుపట్టలేని విధంగా మారడంతో సుధాకర్‌ తల్లిదండ్రులు రాజేష్‌ను తమ కొడుకే అనుకున్నారు. చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది సుధాకర్‌రెడ్డి కాదని తల్లి గుర్తించడంతో.. హత్యకేసు బయటపడింది.  ఈ కేసులో ఇప్పటికే స్వాతిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రాజేష్‌ పూర్తిగా కోలుకున్న తరువాత అరెస్ట్‌ చేస్తామంటున్నారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials