Live News Now
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
  • రికార్డు గరిష్ట స్థాయికి పెట్రో ధరలు..
  • కేంద్రానికి నరసింహన్ నివేదికపై సస్పెన్స్..
  • ఏపీలో హోరెత్తుతున్న హోదా ఆందోళనలు.. శ్రీశైలం భ్రమరాంబకు బోనాలు
  • ధాన్య రాశుల నిలయంగా నల్గొండ!.. సీఎం చొరవతోనే సాధ్యమైందన్న హరీష్
  • జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. పుల్వామా జిల్లాలో టెన్షన్‌ టెన్షన్
  • బాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్.. తొలిసారి ఆరోపణలు చేసిన సరోజ్‌ ఖాన్
  • ఏపీలో చంద్ర క్రాంతి ప్రారంభం.. ద్వారపూడిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
  • కర్ణాటక కాంగ్రెస్‌కు ఐటీ షాక్.. మంత్రి మహదేవప్ప ఇంట్లో రైడ్స్
  • తలకు బదులు కాలుకు ఆపరేషన్.. ఢిల్లీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం ScrollLogo ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ScrollLogo కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి ScrollLogo కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం.. ScrollLogo వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా ScrollLogo 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్ ScrollLogo టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా ScrollLogo పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం.. ScrollLogo ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు

భగ్గుమన్న పాతకక్షలు... పట్టపగలు అన్నదమ్ముల దారుణ హత్య..!!

Two-Brothers-Brutally-Killed-In-Nellore-District
Posted: 138 Days Ago
Views: 1485   

నెల్లూరు జిల్లా పాత కక్షలు భగ్గుమన్నాయి. గూడూరులో అన్నదమ్ములను.. ప్రత్యర్థులు అత్యంత దారుణంగా నడిరోడ్డుపైనే నరికి చంపారు. ఇందిరానగర్లో నివాసం ఉంటున్న పెద్ద జయరామయ్య, చిన జయరామయ్యలు.. గతంలో జరిగిన నారాయణ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఆ కక్షతోనే నారాయణ వర్గం వీరిద్దరినీ హత్య చేసినట్లు తెలుస్తోంది. పట్టపగలు జరిగిన ఈ జంట హత్యలతో ఇందిరానగర్‌ వాసులు భయాందోళనలకు గురయ్యారు.
వీరిద్దరినీ హత్య చేయడానికి నారాయణ వర్గం పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నారాయణ హత్య జరిగిన తర్వాత.. వీరిద్దరినీ గ్రామం వదిలి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో.. కోట మండలం విద్యానగర్‌కు మకాం మార్చారు. వీరిని ఎలాగైనా రప్పించి హత్య చేయాలనుకున్న నారాయణ వర్గం..  రెండు రోజుల క్రితం ఇందిరానగర్‌లోని చినజయరామయ్య గుడిసెను తగలబెట్టింది. విషయం తెలియడంతో.. ఇంటిని పరిశీలించేందుకు అన్నదమ్ములిద్దరూ ఇందిరానగర్‌కు వచ్చారు. అప్పటికే మారణాయుధాలతో కాపు కాచిన ప్రత్యర్థి వర్గం.. ఒక్కసారిగా విరుచుకుపడింది. వారిద్దరూ తేరుకునే లోగానే కత్తులతో నరికి చంపింది. అనంతరం ఈ హత్య చేశామంటూ ముగ్గురు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం కలకలం రేపుతోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials