Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

సీబీఐటీలో విద్యార్ధుల ఆందోళన ఉదృతం

Protest-against-CBIT-fee-hike-continues
Posted: 221 Days Ago
Views: 187   

CBIT లో ఫీజుల గొడవ మళ్లీ మొదటికొచ్చింది. రెండు రోజుల కిందట ఫీజులు తగ్గిస్తామన్న యాజమాన్యం... దానిపై సర్క్యులర్ విడుదల చేయలేదు. విద్యార్థులు దీనిపై ప్రశ్నించినా మేనేజ్ మెంట్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్టూడెంట్స్ మరోసారి ఆందోళన బాట పట్టారు. కాలేజీ బస్సులను అడ్డుకున్నారు. గండిపేట నుంచి కాలేజీ వరకు భారీ ర్యాలీ చేశారు. ఫీజు తగ్గింపు ఉత్తర్వులు విడుదల చేసేంత వరకు పోరాటం ఆగదని విద్యార్థులు చెప్పారు.

హైకోర్టు ఉత్తర్వుల పేరుతో సీబీఐటీ యాజమాన్యం ఫీజులు పెంచింది. అయితే ఇవి భారంగా ఉన్నాయని విద్యార్థులు రోడ్డెక్కారు. నిజానికి TFRC సీబీఐటీకి లక్షా ‌13వేల 500 రూపాయల ఫీజును నిర్ణయించింది. కానీ కాలేజీ మాత్రం ఇది తమకు అంగీకారం కాదని 2ల‌క్షల 59వేల 867 కావాలని కోరింది. దీనికి TFRC అంగీకరించలేదు. దీంతో CBIT యాజమాన్యం 2016లో కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థుల నుంచి 2 లక్షల ఫీజును వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 21న ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం సీబీఐటీ ప్రతి విద్యార్థి నుంచి అదనంగా 86వేల 500 వసూలు చేసుకోవడానికి వీలు కలిగింది. హైకోర్టు ఉత్తర్వుల పై TFRC కోర్టులో అప్పీలు చేసింది. దీంతో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజు మొత్తానికి బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కాలేజీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ  క్రమంలో అదనపు ఫీజు చెల్లించాల్సిందిగా యాజమాన్యం నోటీసులు జారీ చేయడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. పెంచిన ఫీజులు తగ్గించాలని ఆందోళన చేస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials