Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

నాగర్‌ కర్నూల్‌ జిల్లా సుధాకర్‌రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్‌

New-Twist-In-Sudhakar-Reddy-Murder-Case,-Nagarkurnool
Posted: 220 Days Ago
Views: 3856   

సంచలనం సృష్టించిన నాగర్‌ కర్నూల్‌ జిల్లా సుధాకర్‌రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. సుధాకర్‌ను హతమార్చేందుకు పెద్ద స్కెచ్‌ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే... అతడ్ని చంపేయాలని ప్లాన్‌ చేశారు.  స్వాతి క్రిమినల్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ దెబ్బకు పోలీసులు షాకయ్యారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలన్నీ పెద్ద క్రైమ్‌ కథా చిత్రాన్ని తలపిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రియుడు రాజేష్‌తో హాయిగా పక్క రాష్ట్రానికి చెక్కెద్దామని ప్లాన్‌ చేసుకుంది.  

సుధాకర్‌రెడ్డిని చంపేందుకు రాజేష్‌తో కలిసి స్వాతి రెండు నెలల ముందే స్కెచ్‌ వేసింది. తరచూ ప్రియుడ్ని కలిసి ఏం చేయాలో మాట్లాడుకునేవారు. మర్డర్‌కు నాలుగు రోజుల ముందే ఈ విషయాన్ని సుధాకర్‌రెడ్డి పసిగట్టాడు. కాని ఏమరు పాటుతో సీరియస్‌గా తీసుకోలేదు. రాజేష్‌తో తనకు రెండేళ్లుగా పరిచయం ఉన్నట్లు స్వాతి పోలీసులకు చెప్పింది. హత్యకు నాలుగు రోజుల ముందు సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ప్లాస్టిక్‌ సర్జన్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్జరీకి ఎంత ఖర్చవుతుందో ఆరా తీశారు. మొత్తం 10 లక్షలతో ప్లాస్టిక్‌ సర్జరీకి ప్లాన్‌ చేసింది.

సుధాకర్‌రెడ్డిని చంపిన తర్వాత... రాజేష్‌ మొహంపై యాసిడ్‌ పోసి... ఆస్పత్రిలో చేర్చాలని భావించింది. అతడు కోలుకున్న తర్వాత... ఇద్దరు కలిసి పుణెకు వెళ్లిపోదామని స్కెచ్‌ వేసింది. అయితే కథ అడ్డం తిరగడంతో... ఇప్పుడు ఊచలు లెక్కబెడుతోంది. మరోవైపు రాజేష్‌ను స్వాతి స్వయంగా ఆస్పత్రిలో చేర్చిన సీసీ ఫుటేజ్‌ కూడా బయటపడింది. ఆ వీడియోలో తన అత్తతో కలిసి స్ట్రెచర్‌పై లోపలికి తీసుకెళుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సమయంలో భర్తను చంపానన్న భయంకాని... తప్పు చేస్తున్నానన్న బెరుకు కూడా ఆమెలో లేదు.

ఇటు స్వాతి ప్రియుడు రాజేష్‌ కోలుకోగానే అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్వాతిని ప్రశ్నించిన పోలీసులు... రాజేష్‌ను అదుపులోకి తీసుకొంటే మరికొన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials