Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

'టిసిఎఫ్-దోహా' వారి క్రిస్మస్ సెలెబ్రేషన్స్

Christmas-in-Doha-2017
Posted: 57 Days Ago
Views: 414   

తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దోహాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు నలుమూలల నుండి దాదాపు 5 వేలకు మందికి పైగా భారీ సంఖ్యలో క్రైస్తవ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం లో ముందుగా….. క్రిస్మస్ పర్వదిన విశిష్టత, ఏసు జన్మ విశిష్టతను కొనియాడుతూ క్రిస్మస్ ఆరాధన గీతాలను ఆలపించారు. పాస్టర్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి ప్రసంగిస్తూ క్రీస్తు పుట్టుక గూర్చి, గల్ఫ్ దేశాలలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న భారతీయులందరు క్షేమంగా ఉండాలని దేవాది దేవుడిని ప్రార్ధించారు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి ఏసుక్రీస్తు పునఃజన్మించారన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమ ప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపనకై దైవ కుమారుడిగా ఏసయ్య ఈ భూమి మీదకు 2017 ఏళ్ళ క్రితం వచ్చాడన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ప్రతీ మానవుడు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను అచరించినప్పుడే సమాజంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయన్నారు. సమసమాజ స్థాపనే ప్రతి మానవుని అభిమతం కావాలన్నారు. కుల మతాల కంటే మానవత్వం చాలా గొప్పదని, మనమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ మన మానవత్వాన్ని ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రత్యేక క్రిస్మస్ సందేశం ఇచ్చి వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సహాయ పాస్టర్ ఇతర పెద్దలు క్రిస్మస్ కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, శాంటాక్లాజ్ వేషధారణతో ఈ వేడుకలో అతిధులందరిని పలకరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు పిల్లలకు బహుమతులు పంచుతూ సందడి చేశాడు. సండే స్కూల్ చిన్నారులు ఏసుక్రీస్తు జన్మ దినోత్సవ అపురూప ఘట్టాన్ని కనులకు కట్టేలా లఘు నాటికలు క్రిస్మస్ పాటలు ఎంతో ఉత్సాహంగా పాటలు ఆలపించారు. వీరి ప్రదర్శన పెద్దలను విశేషంగా అలరించాయి. దోహాలోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో క్రీస్తు పుట్టుక దీనజనోద్ధరణకు మహాప్రభు మానవ జన్మ ఎత్తి అభాగ్యులను అక్కున చేర్చుకున్నారనే అంశం. పాపులను క్షమించి.. వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదించినట్లు తదితర బైబిల్ సత్యాలను చక్కని కధానాలుగా మలిచి యువతీ యువకులతో చక్కని ప్రదర్శన చేయించిన నిర్వాహకుడు గోవాడ కిరణ్ ను పలువురి అభినందనలు పొందారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials