Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

రూట్ మార్చిన వైసీపీ ఎమ్మెల్యేలు

ycp-mla's-Special-Story
Posted: 138 Days Ago
Views: 2239   

ఏపీలో ఇప్పుడు వైసీపీ  ఎమ్మెల్యేలు రూట్ మారుస్తున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గాలలో చేపడుతునే తమతమ సొంత ప్రోగ్రాంలతో జనంబాట పడుతున్నారు. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు మిగిలిన ఎమ్మెల్యేల కంటే తమ కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు . అటు అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటాలు చేయడంలోనూ , పార్టీ వ్యవహరాలను కేడర్ లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు సొంత ఇమేజ్ ను నియోజకవర్గాలలో పెంచుకోవడానికి ఎడతెరిపి లేకుండా కార్యక్రమాలను జనం ముందుకు  తీసుకెళుతున్నారు .

నెల్లూరు జిల్లాలో బలమైన గొంతుక వినిపించే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మన ఇంటికి మన ఎమ్మెల్యే ప్రోగ్రాంతో వందరోజులకు పైగా నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు . క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకొంటూ ముందుకెళుతున్నారు . దీనితో పాటు తన యాక్టివిటీని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువచేసేందుకు నిరంతరం ఫేస్ బుక్ లైవ్ లతో పబ్లిక్ కి టచ్ లో ఉంటున్నారు . సోషల్ మీడియాన బాగా ఉపయోగించుకొనే కోటంరెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని ఓ రౌండ్ చుట్టూసి ప్రజలకు చేరువయ్యేలా పక్క ప్లాన్ చేసుకుంటున్నారు .

ఇక ఇదే జిల్లాలో మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రోజుకో కార్యక్రమం తో తమతమ యాక్టివిటీస్ చేసుకుంటుపోతున్నారు . నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రజా దీవెన యాత్ర పేరుతో వరసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకెళుతున్నారు . ముఖ్యంగా అధికార పార్టీ పై దూకుడుగా వెళ్లే అనిల్ ...ఇటీవల అక్రమణల తొలగింపు సందర్భంగా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ ఆందోళన చేపట్టారు . సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా నియోజకవర్గంలో పల్లె నిద్ర పేరుతో గ్రామాల బాట పడుతూ నియోజకవర్గంలో ప్రజలకు టచ్ లో ఉండేలా వరస కార్యక్రమాలు జోరుగా కొనసాగిస్తున్నారు . 

వైసీపీలోని చాలా మంది ఎమ్మెల్యేలు ఒకవైపు పార్టీ కార్యక్రమాలును పూర్తి స్థాయిలో నిర్వహిస్తూనే  సొంతంగా పార్టీ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు  . నియోజకవర్గాలలోని స్ధానిక సమస్యలపై పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటున్నారు . నగరి ఎమ్మెల్యే గాలేరి నగరి ప్రాజెక్ట్ అంశంపైన , ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి హంద్రీ నీవా ప్రాజెక్ట్ పైనా వివిధ రూపాలలో వరసగా ఆందోళనలు నిర్వహించారు .బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి పార్టీ ప్రకటించిన గడపగడపకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పేరుతో గ్రామాల బాట పట్టారు . 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials