Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

సినీపరిశ్రమలో అవకాశాలు రాకపోవటంతో మోసాలు చేస్తున్న నటి శ్రుతి..!

Heroine-shruthi-cheats-wealthy-young-mens
Posted: 134 Days Ago
Views: 2398   

ఫేస్‌బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కి సంబంధించిన వివాదాలు, కేసులు, మోసాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇటివల వెలుగులోకి వచ్చిన శ్రుతి కేసు కూడా ఫేస్‌బుక్‌కి సంబంధించినది కావడం విశేషం.

సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవటంతో పలువురు యువకులను టార్గెట్ చేసి  శ్రుతి మోసం చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఫేస్‌బుక్‌లో తన అందమైన ఫోటోలు పెట్టి రూ.1.50 కోట్లు దొచుకొని తన కుంటంబ సభ్యులతో జైలు జీవితం గడుపుతుంది. కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి  ఆడి పోనాల్‌ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం  విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతుంది. 

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన బాలకృష్ణన్‌  విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతన్ని శ్రుతి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెడుతూ, ఇంగ్లిషులో మాట్లాడుతూ బాలకృష్ణన్‌ ప్రేమలో‌కి దించింది. బాలకృష్ణన్‌ పెళ్లి ప్రస్థావన తీసుకురావటంతో దీనిని అవకాశంగా తీసుకున్నది శ్రుతి. తన తల్లికి ఆరోగ్యం బాగలేదని ఆపరేషన్ చేయించాలని బాలకృష్ణన్‌ దగ్గర నుంచి రూ. 5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిపై అప్పు ఉందని ఈ పరిస్థితులో పెళ్లి చేసుకొలేని చెప్పటంతో శ్రుతికి  రూ. 45 లక్షలు పంపాడు బాలకృష్ణన్‌. 

శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపడంతో, వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని, ఎనిమిది మంది యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్‌ వెంటనే శ్రుతికి ఫోన్‌ చేసి నిలదీయడంతో కట్‌ చేసి ఏకంగా స్విచ్‌ ఆఫ్‌ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్‌ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

శ్రుతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపాట్టారు. చిదంబరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరుళ్‌కుమార్‌ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర, సోదరుడు సుభాష్‌, బంధువు వెంకటేష్‌ , స్నేహితుడు శబరినాథ్‌ లను కూడా  సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials