Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

భోగి పండుగ ప్రత్యేకత ఇదే..!

Importance-of-Bhogi-Festival
Posted: 133 Days Ago
Views: 331   

తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజులలో మెదటిరోజే భోగి. సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే  భోగి పండుగలో ముఖ్యమైనవి భోగి పళ్ళు, భోగి మంటలు, భోగి పులక, గాలిపటాలు, కోడి పందాలు. 

భోగి రోజు సాయంత్రం తమ ఇంట్లోని చిన్న పిల్లల తలపై భోగిపండ్లు పోస్తారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, కొందరు చిల్లర నాణేలు కూడా  వాడతారు. మరి కొందరు శనగలు కూడా కలుపుతారు. భోగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. 

ముఖ్యంగా రేగుపండ్లు  పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందని నమ్ముతారు. భోగి పండ్లను పోవటం వలన తలపై ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమవుతుందని, దీని వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. 

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా దూరం అవుట వలన భూమిపై చలి బాగా పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు. 

భోగి రోజున తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య మంటలు వేస్తారు. దీనినే భోగి మంటలు అంటారు. భోగి మంటలలో పాత వస్తువులను వేయటం ఆనవాయితీ.  భోగం అనే పేరుకు అర్ధం అనుభవం. దేనిని అనుభవించడం వలన మనకు ఆనందం కలుగుతుందో దానిని భోగం అంటారు. అలాంటి భోగము అనుభావిన్చావాల్సిన రోజునే భోగి అంటారు. చలి పెరిగిన కాలంలో వెచ్చధనమే ఒక భోగం కాబట్టి భోగి నాడు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
 
పంటలు చేతికొచ్చిన తర్వతా మరొక పంట కొరకు రైతులు తమ సాగుభూమికి నీరు పారించి తడి పెడతారు. పంటకు నీరు పారించి తడి చేస్తారు కనుక పులకేయడం అని పిలుస్తారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులకగా పెద్దలు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున పౌరుషానికి ప్రతీకగా కోడిపందాలు నిర్వహిస్తే, మరి కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడంలో పోటీపడుతుంటారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials