Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

ఫిబ్రవరిలో పంచాయతి ఎన్నికలకు కేసీఆర్ సన్నాహాలు..

CM-KCR-Over-Gram-Panchayat-Elections-and-Pattadar-Passbooks
Posted: 129 Days Ago
Views: 365   

ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు ఉంటాయని సీఎం కేసీఆర్ హింటిచ్చారు. మరోవైపు మార్చి 11 నుంచి  అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదార్ పాస్‌ పుస్తకాల పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం.. పలు కీలక సూచనలు చేశారు. గడువులోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, వీలైతే ఫిబ్రవరిలోనే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

కొత్త పంచాయతీ రాజ్ చట్టం.. పంచాయతీలకు ఎన్నికలు.. రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ.. అంశాలపై సీఎం కేసీఆర్ పూర్తి కసరత్తు ప్రారంభించారు. దీనికి సబంధించి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన భేటీలో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 8వేల 6 వందల 84 గ్రామ పంచాయతీలుండగా.. కొత్తగా మరో 4 వేల పంచాయతీల ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం కలెక్టర్లకు తెలిపారు.. మార్చి 12 నుంచి రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.. మండల, డివిజన్‌స్థాయి రెవెన్యూ కోర్టుల స్థానంలో.. ఇక నుంచి రెవెన్యూ కోర్టు ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉండాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా 443 మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సదుపాయం ఉంటుందని సీఎం తెలిపారు.. 

రిజిస్ట్రేషన్‌ విధానంలో కోర్‌ బ్యాకింగ్‌ నెట్‌వర్క్‌ విధానం అమలు చేస్తామన్నారు. భూమి కొనుగోలు చేసిన వెంటనే పాస్‌పుస్తకాల్లో మార్పులు చేసేలా చూస్తామన్నారు. పాస్‌బుక్‌లను కొరియర్‌ ద్వారా రైతుల ఇంటికే పంపిస్తామని వెల్లడించారు. మార్చి 11 నుంచి అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ధరణి వెబ్‌సైట్‌లో భూ రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈ వెబ్‌సైట్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల విధానంపై చర్చిస్తున్నామని. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు కేసీఆర్‌ తెలిపారు.. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే బడ్జెట్‌లో గ్రామ పంచాయతీలకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల  పంపిణీ కోసం.. ప్రతీ గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించి, ఒక వాహనం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతీ జిల్లాకు ఒక రెవిన్యూ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు.. 

రైతులందరూ ఒకే రోజు మార్కెట్‌కు రాకుండా వంతులవారీగా పంటను సులువుగా అమ్మి, డబ్బు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. పాస్ పుస్తకాల పంపిణీ, ఆర్థిక సాయం విషయంలో అవకతవకలు, అవినీతికి తావులేకుండా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. నెలాఖరులో ముఖ్యమంత్రి మరోసారి కలెక్టర్లతో సమావేశం కానున్నారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials