Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా ఇదే

NTR-AND-RAMCHARAN-MULTI-STAR-MOVIEW
Posted: 129 Days Ago
Views: 9684   

బడ్జెట్ 150 కోట్లు. కథ ఫ్యామిలీ డ్రామా. ఇద్దరు అన్నదమ్ముల మధ్య నడిచే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తొమ్మిది నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే యేడాది దసరాకు సినిమా విడుదలవుతుంది. అంతే కాదు. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీల్లోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఏంటీ టైటిల్ లేని సినిమాలా ఈ స్టోరీ ఏంటా అనుకుంటున్నారా.. దెన్ వాచ్ దిస్.. 

ఇప్పటి వరకూ విన్నదంతా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా న్యూస్. కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలియదని ఫీలవుతోన్న అభిమానులకు మాగ్జిమం క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి ఈ సినిమాను ముగ్గురి రెమ్యూనరేషన్స్ తో కలుపుకుని మొత్తం 150కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటి వరకూ తను టచ్ చేయని ఫ్యామిలీ డ్రామాను ఇందులో చూపించబోతున్నాడు. రాజమౌళి సినిమాలంటే ఇప్పటి వరకూ యాక్షన్ ఎంటర్టైనర్స్ గానే చూశాం. కానీ పూర్తి స్థాయిలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయబోతుండటం ఇదే మొదటి సారి. అది కూడా ఇద్దరు మాస్ హీరోలతో చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. 


ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములుగా కనిపిస్తారు. ఈ ఇద్దరి సరసన నటించే హీరోయిన్ల వేట కూడా కొనసాగుతోందట. కొత్త హీరోయిన్లైతే బెటర్ అని కొందరు లేదు ఆల్రెడీ స్టార్ హీరోయిన్లైతేనే క్రేజ్ మరింత పెరుగుతుందనే డిస్కషన్స్ జక్కన్న క్యాంప్ లో సాగుతున్నట్టు టాక్. ప్రస్తుతం చాలా స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ దసరా తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ లోగా చరణ్ రంగస్థలంతో పాటు బోయపాటి సినిమా పూర్తవుతుంది. ఇటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా ఫినిష్ చేస్తాడు. 

ఇక ఈ బిగ్గెస్ట్ అండ్ క్రేజీయొస్ట్ మల్టీస్టారర్ ను 2019 సమ్మర్ లో విడుదల చేసేందుకు ముందే ఫిక్స్ అయిపోయారు. ముందు సంక్రాంతికి అనుకున్నారట. కానీ అప్పటికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సైరా, ప్రభాస్ సాహో, ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేసుకుని ఉన్నాయి. దీంతో తమ ప్రాజెక్ట్ సమ్మర్ అయితేనే బావుంటుందని అనుకున్నారట. అప్పటికి దాదాపు మూడువారాల పాటు పెద్దగా పోటీ లేని డేట్ చూసి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా విడుదల చేస్తారట. ఏదేమైనా ఇంకా ప్రొడక్షన్ కు కూడా రాని ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే ఇంత క్రేజ్ తెచ్చుకుందంటే.. ఇక తర్వాతెలా ఉంటుందో.. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials