Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

లోకల్‌ పులులు.. నాన్‌లోకల్‌ పిల్లులు.. టీమిండియా 'చెత్తాట'పై క్రికెట్‌ లవర్స్‌ సెటైర్లు

india-slump-series-defeat-against-south-africa-twitterati-anguished-with-indias-poor-cricket
Posted: 35 Days Ago
Views: 994   

స్వదేశంలో సత్తా చూపించిన కోహ్లీసేన.. పరాయి దేశంలో ఘోర వైఫల్యాలను మూటగట్టుకుంటోంది.. సఫారీల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతోంది.. రెండో టెస్ట్‌లోనూ ఓటమిపాలై సిరీస్‌ చేజార్చుకుంది.. అటు కోహ్లీసేన ఆట తీరుపై ఫ్యాన్స్‌ సీరియస్‌ అవుతున్నారు. ట్విట్టర్‌లో తిట్ల దండకం ఎక్కుపెడుతున్నారు. వరుసగా 9 టెస్ట్ సిరీస్ విజయాలు.. నంబర్ వన్ టెస్ట్ టీమ్ హోదా.. ఇవన్నీ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లకముందు టీమిండియాకున్న రికార్డులు.. ఇక ఎక్కడైనా తిరుగులేదనుకున్న టీమిండియాను సౌతాఫ్రికా పిచ్‌లు పిచ్చెక్కిస్తున్నాయి.. ఏడాదిని ఓటమితో ప్రారంభించిన కోహ్లీసేన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది. రెండో టెస్టులోనూ అదే రకమైన ఆటతీరును ప్రదర్శించి ఘోర ఓటమి పాలైంది.. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలన్న 25 ఏళ్ల కల మళ్లీ కలగానే మిగిలిపోయింది. రెండో టెస్ట్‌లో 135 పరుగుల విజయంతో టీమిండియాపై గెలిచిన సఫారీలు 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు.

287 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 151 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ శర్మ చేసిన 47 పరుగులే టీమిండియాలో అత్యధిక స్కోరు. దక్షిణాఫ్రికా కొత్త బౌలర్‌ లుంగి ఎన్‌గిడి విజృంభించి ఆరు వికెట్లు పడగొట్టి కోహ్లీ సేన పతనాన్ని శాసించాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కనీస పోరాట పటిమ కూడా చూపకపోవడం, అనవసర షాట్లకు ప్రయత్నించి వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఓటమి పాలైంది. 3 వికెట్ల నష్టానికి 35 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరు దగ్గర  చివరి రోజు  బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ముఖ్యంగా ఎన్‌గిడీ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ చుక్కలు చూశారు. చివర్లో రోహిత్‌, షమి పోరాడకుంటే... భారత్‌ ఆ మాత్రం పరుగులు కూడా చేసేది కాదు. మొత్తానికి అంతా అనుకున్నట్లే బౌన్సీ పిచ్‌లపై కోహ్లీ సేన చేతులెత్తేసి స్వదేశంలోనే పులులనే పేరును మరోసారి నిలబెట్టుకున్నారు. కోహ్లీ సేన ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో సెటైర్లు వేస్తున్నారు.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials