Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

మొన్న ఫ్యాన్స్ కాళ్ళకు మొక్కి.. నేడు ఫ్యాన్స్ పై మండిపడ్డ సూర్య..!!

hero-suriya-fires-on-his-fans
Posted: 34 Days Ago
Views: 330   

మన దేశంలో హీరోలకు అభిమానులు ఎక్కువే... ఇక దక్షిణాదిన హీరోలపై అభిమానులు ఓ రేంజ్ లో అభిమానం చూపిస్తారు.. తమ హీరో గొప్పదనం తెలియజేయడం కోసం ప్రాణం కూడా ఇచ్చేస్తారు.. కాగా తమ అభిమానులను అభిమానించే హీరోలు ఎక్కువగా కోలీవుడ్ లో కనిపిస్తారు. రజనీకాంత్, విక్రమ్, సూర్య, కార్తీ, విశాల్ వంటి వారు ఈ కోవకే చెందిన హీరోలు.. కాగా ప్రముఖ హీరో సూర్య తన అభిమానులపై మండిపడ్డాడు. అంతేకాదు.. మరోసారి ఇలా చేయవద్దు అని కూడా అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. అదేమిటి గ్యాంగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించి.. ఇప్పుడు ఇలా మండిపడడం ఏమిటా అని అనుకుంటున్నారా..? సూర్య ఇలా తన అభిమానులపై ప్రేమతోనే కోపం వ్యక్తం చేశాడు.

సూర్య తాజా సినిమా గ్యాంగ్ సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా పలు ప్రాంతాల్లో సూర్య పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగా సూర్య గురువారం రాత్రి చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా సూర్య అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొంతమంది అభిమానులు హెల్మెట్ లేకుండా చాలా స్పీడ్ గా బైక్ రైడ్ చేశారు. ఒక బైక్ అదుపు తప్పి సూర్య కారు కింద పడబోయింది. ఇది చూసిన సూర్య.. హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేస్తారా..? ఎందుకు అంత స్పీడ్ అని తన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిమానులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. ఆ బాధ తనకు జీవితాంతం ఉంటుంది అని సూర్య ఆవేదన వ్యక్తం చేస్తూ.. తనకు అభిమానులపై ఉన్న అభిమానాన్ని బయట పెట్టాడు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials