Live News Now
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
  • మిషన్‌ 2019కి ప్రాంతీయ పార్టీలు సిద్ధం
  • బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు చంద్రబాబు సారధ్యం
  • నేడు తెలంగాణ టీడీపీ మహానాడు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు
  • తూత్తుకుడి హింసలో పెరుగుతున్న మృతులు
  • తూత్తుకుడిలో కాల్పులపై ఫైరవుతున్న పొలిటికల్‌ పార్టీలు
  • పగలు భానుడి భగభగలు.. సాయంత్రం వానలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
  • రాజస్థాన్‌ను ఇంటికి పంపిన నైట్‌ రైడర్స్‌
  • సన్‌ రైజర్స్‌తో క్వాలిఫయర్‌ 2కి నైట్‌ రైడర్స్‌ రెడీ
ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్ ScrollLogo హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం.. ScrollLogo బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు ScrollLogo కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం... ScrollLogo బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం ScrollLogo సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి ScrollLogo మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం.. ScrollLogo రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు ScrollLogo సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు ScrollLogo తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..

విభజన హామీలపై కేంద్రంతో పోరాటానికి సై అన్న చంద్రబాబు

Chandrababu-Naidu-Serious-Comments-on-BJP-over-Partition-Guarantees
Posted: 128 Days Ago
Views: 298   

విభజన హామీలపై కేంద్రంతో పోరాటానికి సై అన్నారు... చంద్రబాబు. ఏపీ ప్రజలు చేతగానివాళ్లు కాదన్న సీఎం.. తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయమంటే ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామనే సంకేతమిచ్చారు. ఇక తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

పోలవరం స్పిల్ వే టెండర్లపై కేంద్రం దిగొచ్చేలా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. విభజన చట్టంలోని హామీల సాధనపైనా ఫోకస్ చేశారు. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమనే సంకేతమిచ్చారు సీఎం. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామన్నారు. ఏపీ ప్రజలకు సామర్ధ్యం లేక  ఆదాయం తగ్గలేదని, విభజన హేతుబద్దంగా లేకపోవడం వల్లే సమస్యలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి చేరుకునేరకు కేంద్రం సాయం చేయాల్సి ఉందన్నారు.పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా కేంద్రాన్ని అడుగుతామని, అయినా స్పందించకపోతే  సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు.

దేశం కన్నా ఏపీ  తలసరి ఆదాయం ఎక్కువన్న నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్ వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. విభజనతో జరిగిన అన్యాయాన్ని సరిచేయమంటే ఆలస్యం చేస్తున్నారని  అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని, మళ్లీ అక్కడి నుంచి రమ్మనడమేంటన్నారు. అభివృద్ధిలో తెలంగాణకు ఏపీకి పోలికేలేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కౌంటరిచ్చారు. తెలంగాణను ఆంధ్రా పాలకులు ధ్వంసం చేశారన్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 1995కు ముందు.. తరువాత హైదరాబాద్‌ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన హామీలపై న్యాయపోరాటం చేస్తామన్న చంద్రబాబు కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఏపీ సీఎం సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials