Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

హైదరాబాద్ లవ్ స్టోరీ రివ్యూ!

Hyderabad-Love-Story-review
Posted: 115 Days Ago
Views: 1568   

అందాల రాక్షసితో తెలుగు సినిమాకు పరిచయం అయిన రాహుల్  లవర్ బాయ్ ఇమేజ్ మెయిన్ టైన్ చేస్తున్నాడు.ప్రేమకథలకు బాగా సూట్ అయ్యే పర్సనాలిటీ రాహుల్ కి బలం. మరోసారి ఆ లవ్ ఫీల్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ చెప్పేందుకు రెడీ అయ్యాడు.ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:
హైదరాబాద్ మోట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఛీప్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు కార్తిక్( రాహుల్). అతన్ని తొలిచూపులోనే భాగి(రేష్మిమీనన్) ను  ప్రేమిస్తుంది. అతనితో ప్రేమను పొందేందుకు ఆమె చాలా ప్రయత్నిస్తుంది.కార్తిక్ కూడా భాగీ ఇష్టపడతాడు. భాగీ తన ప్రేమను చెప్పేలోపు అతని పాత ప్రేమకథ తెలుస్తుంది. ఇంతలో ఆ ప్రేమకథలోని కార్తిక్ గాళ్ ప్రెండ్ వచ్చి కార్తిక్ గురించి ఒక షాకింగ్ న్యూస్ చెబుతుంది. అప్పటినుండి కార్తిక్ ని తప్పించుకు తిరుగుతుంది భాగీ. భాగీ ఎందుకు దూరం అవుతుందో తెలియక కార్తిక్ ఇబ్బంది పడుతుంటాడు. అసలు కార్తిక్ గురించి భాగీ కి తెలిసిన నిజం ఎంటి..? అతని మొదటి ప్రేమకథ ఎందుకు ఫెయిల్ అయ్యింది. భాగీ కార్తిక్ ల ప్రేమ కథ ఏ టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ.

కథనం:
హైదరాబాద్ లవ్ స్టోరీ కి ప్లస్ పాయింట్స్ గా నిర్మాణ విలువలు నిలుస్తాయి. ఏం.ఏల్ రాజు, ఆర్, ఏస్. కిషన్, వేణు గోపాల్  నిర్మాణం హైదరాబాద్ లవ్ స్టోరీ రిచ్ గా అనిపించింది.స్నేహం మద్య నలిగిపోయిన ప్రేమకథలు ప్రేక్షకులకు కొత్త కాకపోయినా దర్శకుడు రాజ్ సత్య ఈ కథనం నడిపిన విధానం ప్రత్యేకంగా అనిపించింది.మెట్రో రైల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథకు ప్రెష్ ఫీల్ ని తెచ్చాడు. రాహుల్ రవీంద్రన్ లవర్ బాయ్ ఇమేజ్ ని హైదరాబాద్ లవ్ స్టోరీ మరో సారి నిలబెట్టింది. లవ్ ని ఫీల్ అయ్యే సందర్భాల్లో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్ రేష్మి మీనన్ చలకీగా కనిపించింది. టీనేజ్ అమ్మాయిలకుండే అల్లరి, అమాకత్వం నిండిన పాత్రలో ఒదిగిపోయింది. రాహుల్ ని చూసేందుకు ఆమె పడే పాట్లను దర్శకుడు చాలా ఫన్ వేల్ తీసుకెళ్ళాడు. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ కూడా ఈ లవ్ స్టోరీ కి అసెట్ గా మారింది. రాహుల్  బ్లడ్ డోనేట్ చేసే టప్పుడు హిందువులకు బ్లడ్ అవసరం  అయితే ముస్లీం అని , ముస్లీం లకు బ్లడ్ అవసరం అయితే హిందు అని చెప్పి సాయం చేయడం వంట సన్నివేశాలను చాలా ఇంప్రెసివ్ గా రాసుకున్నాడు దర్శకుడు రాజ్ సత్య. స్నేహం కోసం రాహుల్ పడే తరుణ అలాగే ఈ సినిమాలో రావు రామేష్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ప్లే చేసాడు. కథను ముడి వేసేది, ఆకథను ముడి విప్పేది ఆ పాత్రే. అందుకే ఈ ప్రేమకథకు రావు రమేష్ కీ రోల్ ప్లే చేసాడు. ప్రేమను అర్దం చేసుకోవడం అంటే ప్రేమించిన వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే వచ్చే ఫీలింగ్స్ చెబుతాయి. అలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ప్రేమ అని మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ పాయింట్ ని క్లైమాక్స్ లో బాగా కన్వెన్సింగ్ చెప్పాడు దర్శకుడు. సునీల్ క్యశప్ బ్యాక గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ప్రేమకథలలో ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ తన ప్రత్యేకతను చాటుకుంది. 

చివరిగా:
ఎంగేజింగ్ లవ్ స్టోరీ


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials