Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రివ్యూ: అనుబంధాల మద్య నలిగే 'పెద్దారెడ్డి'

Review:-Nellore-Pedda-Reddy
Posted: 94 Days Ago
Views: 1255   

రివ్యూ: నెల్లూరి పెద్దారెడ్డి

తారాగణం: సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్, ప్రభాస్ శ్రీను, అంబటి శీను, సమ్మెట గాంధీ తదితరులు
సంగీతం: గురురాజ్
సినిమాటోగ్రఫీ – బాలసుబ్రహ్మణి
నిర్మాత: రఘునాథ రెడ్డి
దర్శకత్వం: వీజే రెడ్డి

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీజే రెడ్డి దర్శకత్వం వహించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది.

సినిమాకథ: నెల్లూరి పెద్దారెడ్డి(సతీష్ రెడ్డి) గ్రామంలో బాగా పలుకుబడి వున్న సర్పంచ్. అందరికీ తలలో నాలుకలా ఏ సమస్య వచ్చినా ఇట్టే చిటికెలో తీర్చేస్తుంటాడు. అలాంటి నెల్లూరి పెద్దారెడ్డికి.. తన భార్య(ముంతాజ్)తో మాత్రం ప్రేమగా ఉండడు. కానీ తన కూతురుని మాత్రం ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటి పెద్దారెడ్డికి అదే గ్రామానికి చెందిన మీనాక్షి(మౌర్యానీ)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో స్నేహం ఏర్పడుతుంది. దాన్ని ఆ వూరిలో వున్న కొంతమంది( ప్రభాస్ శ్రీను, అంబటి శీను తదితరులు) అపార్థం చేసుకుంటారు. ఈ విషయం అతని భార్య ఐశ్వర్య(ముంతాజ్)కి చెబుతారు. ఆమె అపార్థం చేసుకున్న మీనాక్షిని చంపాలని అదే గ్రామానికి చెందిన కుక్కేశ్వరరావు(ప్రభాస్ శీను) అండ్ బ్యాచ్ కు చెబుతుంది. అలా మీనాక్షి అడ్డును తొలగించుకోవాలనుకున్నా ఐశ్వర్య కోరిక నెరవేరిందా? అసలు ఐశ్వర్యతో.. నెల్లూరి పెద్దారెడ్డికి ఎందుకు సఖ్యత వుండదు? చివరకు మీనాక్షి ఏమైంది తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

విశ్లేషణ:
పూర్తి గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేసే వారు తక్కువయ్యారు. ఇప్పుడంతా యూత్ చుట్టూ సినిమాలు తిరుగుతున్నాయి. అలాంటి టైం వచ్చిన ఈ పెద్దారెడ్డి ఆడియన్స్ కి కొత్తగా అనిపించాడు. ఒక ప్రెసిడెంట్ గా తప్పు చేసిన ఇల్లాలిని క్షమించి తన కూతురు కానీ కూతుర్ని ప్రాణం గా ప్రేమించే ఉదాత్త మైన పాత్రకు సతీష్ రెడ్డి న్యాయం చేసాడు. ఈ కథలో మీనాక్షి పాత్రను పోషించన మౌర్యానీ కి మంచి ప్రశంసలు దక్కుతాయి. మంచి మనసు అనేది స్థాయిని బట్టి ఉండదు.. తినడానికి తిండి లేకపోయినా.. ఎదుట వారికి సాయం చేయాల్సి వచ్చినప్పుడు ముందుండే మీనాక్షి పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఆమె మాటతీరు, మనిషి తీరు కూడా అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా ఉండి పాత్ర సహజంగా ఉంది అనిపించేలా చేసింది. ఎంత మోడ్రన్ టెక్నాలిజీ డవలెప్ అవుతున్నా ఇంకా పల్లెల్లో హెచ్చు తగ్గులు తగ్గడం లేదు.. జాతి కులం మద్య గోడల ఎత్తులు తగ్గడం లేదు.. అలాంటి హెచ్చు తగ్గుల మద్య నలిగే పాత్ర మీనాక్షిది. ఎదుటి వారికి మంచి చేయాలనే గుణం తప్ప సొంత సుఖం చూసుకోని పాత్ర పెద్దారెడ్డిది. ఇలాంటి పాత్ర మద్య ఉన్న అనుబంధంను అంతే హుందాగా మలచడంలో దర్శకుడు వీజే రెడ్డి సక్సెస్ అయ్యాడు.
సినిమాను ఆద్యంతం ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించి.. ఓ వర్గం ఫ్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కచ్చితంగా ఈ సినిమా బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అనుబంధాల మద్యే నలిగే పాత్రలో పెద్దారెడ్డి పాత్ర గుర్తుండి పోతుంది. గ్రామ సర్పంచ్ పాత్ర పోషించిన సతీష్ రెడ్డి.. గ్రామ పెద్దగా బాగా ఆకట్టుకున్నాడు. సర్పంచ్ పాత్రలో తన ఆహర్యాన్ని అచ్చం గ్రామీణ వాతావరణంలో పెరిగిన వ్యక్తి వలే చూపించి మెప్పించాడు. యాక్షన్ సీన్స్ లోనూ మాస్ మెప్పించేలా కనిపించాడు. అలానే మౌర్యానీ కూడా ఓ వైపు గ్లామర్ ఒలక బోస్తూనే… మరోవైపు సినిమా కథను ముందుకు తీసుకుని వెళ్లడంలో తన వంత పాత్రను పోషించింది.

చివరిగా : అనుబంధాలకు పెద్ద ‘ నెల్లూరి పెద్దారెడ్డి'


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials