Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రివ్యూ: కిరాక్ పార్టీ...

Review:-Kirrak-Party-movie
Posted: 94 Days Ago
Views: 1289   

నటీనటులు : నిఖిల్, సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డే
దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
సంగీతం : అంజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫర్ : అద్వైత గురుమూర్తి
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
స్క్రీన్ ప్లే : సుధీర్ వర్మ
విడుదల తేదీ : మార్చి 16, 2018

కిరాక్ పార్టి కన్నడంలో సంచలన విజయం దక్కించుకున్న సినిమా. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ మూవీకి నిఖిల్ బాగా కనెక్ట్ అయ్యాడు. తన స్నేహితులు సుధీర్ వర్మ, చందు మొండేటి ల తోడు తీసుకొని కిరాక్ పార్టీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి పూర్తి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కథ :

స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణ (నిఖిల్) మొదటి సంవత్సరంలోనే నాల్గవ సంవత్సరం చదువుతున్నసీనియర్  మీర(సిమ్రన్ పరీన్జ)ను ప్రేమిస్తాడు. అది ప్రేమ అని ఇద్దరూ ఫీల్ అయ్యే సందర్భంలో ఆమె అతనికి దూరం అవుతుంది.  మీరా దూరం అయ్యాక తనెంటే ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది. ఆ బాధ అతన్ని కఠినంగా మార్చుతుంది. కృష్ణలోని చిలిపితనం పోతుంది.. ఫ్రెండ్స్ దూరం అవుతారు.. కానీ తన జూనియర్ సత్య( సంయుక్త హెగ్డే) మాత్రం తన మీద ప్రేమ చూపిస్తుంటుంది. అది ప్రేమని తెలిసినా కృష్ణ పట్టించుకోడు.. మరి సత్య ప్రేమ గెలిచిందా..? కృష్ణ ఎలా ఉండాలని మీరా కోరుకుందో అలా కృష్ణ మారతాడా..? అనేది మిగిలిన కథ..

కథనం:

పాత్ర గా మాత్రమే పరిచయం అవడం తెలిసిన హీరో నిఖిల్. అతని సక్సెస్ ఫార్ములా కూడా అదే. కృష్ణ పాత్రలోని రకరకాల ఛేంజ్ లను చాలా సునాయాసంగా చూపించాడు. జూనియర్ తాలూకు చిలిపితనం.. ఫ్రెండ్స్ తో మూవ్ అయ్యే టప్పుడు బాడీ లాంగ్వేజ్ అంతా నిఖిల్ లో  ఆర్టిస్ట్ కి ఉన్న సత్తాను చూపెడుతుంది. కాలేజ్ వాతారణనాన్ని పూర్తిగా తెరమీదకు తీసుకు రావడంలో దర్శకుడు  శరన్ సక్సెస్ అయ్యాడు. స్కూటర్ పై నిఖిల్ హీరోయిన్ ని తిప్పే సన్నివేశం పాతదే అయినా దాన్ని ప్రెష్ గా డీల్ చేసాడు. అలాగే మీరా క్యారెక్టర్ ని మోస్ట్ లవబుల్ గా మలచడంతో ఆ పాత్రపై ప్రేక్షకులకు ప్రేమతో పాటు సింపథీ కూడా క్రియేట్ అయ్యింది. అయితే ఆ పాత్రమీద పెంచుకున్న ప్రేమ ఆమె దూరం అవడంతో కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఒక అమ్మాయి చనిపోవడం బాధే అయినా చనిపోయిన తీరు పై సమాజంలో విసిరే కామెంట్స్  ఆ బాధను మరింత పెంచుతాయి.  ఆ సన్నివేశాన్ని దర్శకుడు బాగా డీల్ చేసాడు. అప్పటి వరకూ అల్లరి చిల్లరిగా కనిపించిన కృష్ణ పాత్ర తర్వాత పూర్తిగా మారిపోతుంది.   ఆ సంఘటన తర్వాత ఆ పాత్రలో కనిపించే భావోద్వేగాలను నిఖిల్ బాగా పండంచాడు. సినిమా ఒక జర్క్ మూమెంట్ తో ఇంటెర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
తర్వాత సినిమా కృష్ణ లైఫ్ రెండూ మారిపోతాయి. స్నేహితులు విడిపోతారు.. వారి మద్యలో కాలేజ్ పాలిటిక్స్ ఎంటరవుతాయి.  సినిమా మరో టర్న్ తీసుకుంటుంది. ఇక కృష్ణ జీవితంలోకి రెండో  అమ్మాయి ఎంటరయిన తర్వాత అతని జీవితంలో కనిపించే పరిస్థితులు కూడా మారిపోతాయి.  ఆ పాయింట్ ని అతను రియలైజ్ అయ్యే పాయింట్ కూడా బాగుంది.

అయితే హీరో తన జీవితంలో ఎదురైన విషాదం అతన్ని కఠినంగా మర్చితే... ఆ మార్పు ను తెరపై బలమైన సన్నివేశాలతో ఎలివేట్ చేయలేకపోయాడు దర్శకుడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ కనిపించే ఫ్రెండ్స్ గా ప్రెష్ ఫేస్ లను తీసుకొని సన్నివేశాలకు పాత ఫీలింగ్ ని తొలిగించాడు.  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ  లో యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలు
చాలా ఉన్నాయి

చివరిగా: కాలేజ్ పార్టీ


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials