ఏపీలో సమ్మె సైరన్ మోగించిన 108 సిబ్బంది

ఏపీలో సమ్మె సైరన్ మోగించిన 108 సిబ్బంది

ఏపీలో 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగారు. పాతబకాయిలు, జీతాలు వెంటనే చెల్లించాలన్న డిమాండ్ తో విధుల్ని బహిష్కరించారు.. జీవీకే సంస్థ నుంచి ఒక్కో ఉద్యోగికి దాదాపు 70 నుంచి 80 వేల వరకు బకాయిలు రావాల్సి ఉంది..అటు 2 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు..ప్రభుత్వం తమ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ..లేదంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు 108 ఉద్యోగులు.

సమ్మెతో ఏపీలో 108 వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాలో 108 సిబ్బంది నిరసనకార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు.. జీతాలు, బకాయిలు రాకపోవడంతో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story